సోషల్ మీడియా బాలీవుడ్ అవకాశం తెచ్చిపెట్టింది

తెలుగు-తమిళ భాషల్లో అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న హీరోయిన్స్ అందరికీ బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తోంది. ఇక్కడ ఫామ్ కోల్పోయి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ అంటూ అన్నీ సోషల్ మీడియా యాప్స్ లో సరికొత్త ఫోటోషూట్స్ అప్లోడ్ చేస్తూ తమ అందాలను ఆరబోస్తూ టైమ్ పాస్ చేసిన, చేస్తున్న చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ పొజిషన్ ఉన్నారు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కృతి కర్భంద. “బ్రూస్ లీ” లాంటి డిజాస్టర్ అనంతరం బాలీవుడ్ కి చెక్కేసిన కృతి ఇప్పుడు మోస్ట్ పాపులర్ హీరోయిన్.

ఇప్పుడు అదే బాటలో “అత్తారింటికి దారేది” చిత్రంతో బాపు బొమ్మగా మారిపోయిన ప్రణీత కూడా పయనిస్తోంది. “హలో గురు ప్రేమ కోసమే” సినిమా తర్వాత అమ్మడికి తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఎలాంటి అవకాశాలు రాలేదు. దాంతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండడం ప్రారంభించింది. ఆ ఫోటోలే ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ లో రెండు సినిమాలు తెచ్చిపెట్టాయి. “హంగామా 2” అనే సినిమాతోపాటు మరో హిందీ సినిమా కూడా సైన్ చేసింది ప్రణీత. మరి బాలీవుడ్ లో అమ్మడి కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus