చాలా రోజులుగా సమంత, ప్రముఖ దర్శకుడు నిర్మాత అయినటువంటి రాజ్ నిడిమోరు పై వస్తున్న ఎఫైర్ వార్తలకు ఈరోజు ఫుల్ స్టాప్ పడింది. కాదు కాదు ఫుల్ స్టాప్ పెట్టేశారు అని చెప్పాలి. ఈరోజు రాజ్ నిడిమోరు ని పెళ్లాడింది సమంత. ఇది ఆమెకు రెండో పెళ్ళి అనే సంగతి తెలిసిందే. ఆ మాటకు వస్తే రాజ్ కి కూడా ఇది రెండో పెళ్ళి అనే చెప్పాలి. స్యామిలి అనే ఆమెను ఇతను 2015 లో పెళ్ళి చేసుకున్నాడు.
సమంత తన మొదటి భర్త అయిన నాగ చైతన్యకి 2021 లో విడాకులు ఇస్తే.. రాజ్ తన మొదటి భార్య స్యామిలికి 2022 లో విడాకులు ఇచ్చాడు. ఫైనల్ గా 2025 లో సమంత- రాజ్ పెళ్ళి బంధంతో ఒకటయ్యారు. ఇదిలా ఉంటే… హీరోయిన్ సమంత రెండో పెళ్ళిపై సీనియర్ హీరోయిన్ పూనమ్ కౌర్ పరోక్షంగా సెటైర్లు వేసింది. ‘సొంత ఇల్లు నిర్మించుకోవడానికి మరొకరి ఇంటిని కూల్చకూడదు.
అది అత్యంత బాధాకరం. నిస్సహాయ స్థితిలో ఉన్న మగవాళ్ళు లేక బ్యాలెన్స్ లేని మగవాళ్ళని డబ్బుతో కట్టేసుకోవచ్చు అనుకోవడం చాలా తప్పు. ఇలాంటి అహంకారపూరితమైన అమ్మాయిని పెయిడ్ పీఆర్ మాత్రం గొప్ప దానిగా ప్రచారం చేయడం దురదృష్టకరం’ అంటూ తన ట్విట్టర్లో పేర్కొంది పూనమ్ కౌర్.
కానీ తన ట్వీట్లో ఎక్కడా కూడా సమంత పేరును ప్రస్తావించింది లేదు. కానీ సమంత- రాజ్..ల సీక్రెట్ వివాహంపై రాజ్ భార్య మండిపడుతూ ఓ పోస్ట్ పెట్టింది. దానికి పూనమ్ చేసిన ఈ ట్వీట్ సింక్ అవుతుంది అనేది చాలా మంది ఉద్దేశం.