తెలంగాణా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖులు ముందు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు అందజేయాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో ముందుగా ఈ రోజు ఉదయం నాగార్జున రూ.50 లక్షల విరాళం ప్రకటించి ఉదారత చాటుకున్నారు. ఆ వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు రూ.కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అదే రేంజ్ లో కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని అనౌన్స్ చేశారు.
ఎన్టీఆర్ కూడా యాభై లక్షలు ప్రకటించారు. విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, డైరక్టర్ త్రివిక్రమ్ రూ.10 లక్షలు, హారిక హాసిన సంస్ధ రూ.10 లక్షల అందించారు. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ అయిదేసి లక్షల వంతున తమ సాయం ప్రకటించారు. వీరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సైతం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలానే లక్ష్మీ మంచు వరద ముంపు ప్రాంతాల్లోకి వెళ్లి ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు.
వరద బాధితులను ఆదుకోవడం కోసం తమిళనాడు ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర సీఎం కె.పళనిస్వామి రూ.10 కోట్ల విరాళం ప్రకటించడం విశేషం. దానికి సంబంధించిన చెక్కుని కూడా తెలంగాణా ప్రభుత్వానికి పంపించారు. అలానే బాధితుల కుటుంబాల కోసం దుప్పట్లు, బట్టలు పంపిస్తున్నామని చెప్పారు. అలానే ప్రముఖ పారిశ్రామిక సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.
చిరంజీవి కోటి రూపాయలు
మహేష్ బాబు కోటి రూపాయలు
నాగార్జున 50 లక్షలు
జూ ఎన్టీఆర్ 50 లక్షలు
విజయ్ దేవరకొండ 10 లక్షలు
హారికా హాసిని క్రియేషన్స్ 10 లక్షలు
త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు
అనీల్ రావిపూడి 5 లక్షలు
హరీష్ శంకర్ 5 లక్షలు
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!