స్టార్ డైరెక్టర్ తమ ప్లాప్స్ కి చెప్పిన ఆసక్తికర కారణాలు

  • June 30, 2020 / 12:50 PM IST

కర్ణుడి చావుకు వంద కారణాలు అనేది పురాణ కాలం నుండి ఉన్న సామెత. ఓ సినిమా ప్లాప్ కావడానికి కూడా లక్ష కారణాలని అందరూ చెవుతూ ఉంటారు. అందరూ చెప్పడం వేరు.. ఆ మూవీ తీసిన డైరెక్టర్ చెప్పడం వేరు. మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కొందరు తమ చిత్రాలు ఎందుకు ఆడలేదో కారణాలు చెప్పారు… ఆకారణాలేమిటో ఇప్పుడు చూద్దాం..

సుకుమార్-1 నేనొక్కడినే– ‘భారీ అంచనాల మధ్య వచ్చిన 1 నెక్కొడినే పరాజయం పాలైంది. నేను వేరే వర్షన్ కూడా రాసుకున్నాడు.. అది తీస్తే హిట్ అయ్యేది…’

మెహర్ రమేష్-శక్తి- ‘సెకండ్ హాఫ్ నేను సరిగ్గా తీయలేదు అందుకే శక్తి ప్లాప్ అయ్యింది’

వి వి వినాయక్- అఖిల్– కొన్ని స్టోరీలు మనల్ని మోసం చేస్తాయి. అఖిల్ కూడా అలాంటి కథే’

తేజ- సీత– “ఎన్నికల ఫలితాలు దెబ్బదీశాయి. 23 ఎన్నికల ఫలితాలు 24న విడుదల చేశాం. ప్రజలు ఆ మూడ్ లో ఉండడం వలన సీత నచ్చలేదోమో’ ‘

హరీష్ శంకర్- షాక్– ” బేసిక్ స్టోరీ లైన్ రవితేజ ఇమేజ్ కి సెట్ అయ్యేది కాదు”

పవన్ కళ్యాణ్- జానీ– ”కమర్షియల్ అంశాలు దృష్టిలోపెట్టుకొని …అనుకున్నది అనుకున్నట్లు తీయలేదు”

కృష్ణ వంశీ-శ్రీ ఆంజనేయం-‘కాన్సెప్ట్ మొదలుపెట్టాక నా కంట్రోల్ తప్పి పోయింది’

శ్రీను వైట్ల- ఆగడు– ‘ కథలో ఎంటరైన్మెంట్ కాకుండా.. ఎంటరైన్మెంట్ కోసం కథ రాయడం జరిగింది’

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus