సినిమాటిక్ యూనివర్స్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు లోకేష్ కనగరాజ్. అతని మొదటి సినిమా నుండి అక్రమ మాదకద్రవ్యాలు పంపిణీ, నైట్ బ్యాక్ గ్రౌండ్, పోలీసులు, మాఫియా …వంటి ఎపిసోడ్స్ ఉంటాయి. ‘నగరం’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ ‘విక్రమ్’ ఇలా అతను తెరకెక్కించిన అన్ని సినిమాల్లో ఇదే ఫార్మాట్ ఉంటుంది. అయితే ‘విక్రమ్’ సినిమాలో సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసి కొన్ని పాత్రలను మళ్ళీ వాడే ప్రయత్నం చేశారు.
ఇలాంటివి అటు అటు తమిళ సినిమా ప్రేక్షకులకి, తెలుగు సినిమా ప్రేక్షకులకి కొత్త అనుభవాన్ని కలిగించాయి అని చెప్పాలి. అందుకే ‘విక్రమ్’ లానే ఇంకా సినిమాలు వస్తే బాగుణ్ణు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) బాటలోనే మరో టాలీవుడ్ దర్శకుడు నడవాలని భావిస్తున్నట్టు తాజా సమాచారం.అతను హిట్లిచ్చిన డైరెక్టర్ కాదు. పైగా ఒకటి రెండు సినిమాలు మాత్రమే తీశాడు.
అతను మరెవరో కాదు చెందు ముద్దు. పేరు వినడానికి కొత్తగా ఉండొచ్చు కానీ ఇతను బ్రహ్మాజీ కొడుకుతో ‘ఓ పిట్ట కథ’ అనే సినిమా తీశాడు. అది ఓటీటీల్లో పెద్ద హిట్ అయ్యింది. త్వరలో ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత అతను ఓ యూనివర్స్ ను క్రియేట్ చేసి ‘ఓ పిట్ట కథ’ ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సినిమాల్లోని పాత్రలను మళ్ళీ చూపిస్తాడట.
వినడానికి బాగానే ఉంది కానీ.. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ చిత్రం హిట్ అయితే అతను అనుకున్నది జరుగుతుంది. లేదంటే అలాంటి ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయడానికి నిర్మాతలు ముందుకు రాకపోవచ్చు.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు