బాలీవుడ్ లో కాలర్ ఎగరేసుకునే లా చేసిన రాజమౌళి, సందీప్..!

  • July 10, 2019 / 05:14 PM IST

‘బాహుబలి’ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్ తో సౌత్ సినిమా అందులోనూ తెలుగు సినిమా స్టామినా ఏంటనేది ఇండియన్ లెవెల్లో రుచి చూపించాడు జక్కన్న. ఇక ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా షేక్ చేసింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ టెన్ హిందీ సినిమాల లిస్ట్ లో మొదటి స్థానంలో ‘బాహుబలి 2’ నే ఉండడం విశేషం. ‘బాహుబలి2’ దరిదాపుల్లో మరే హిందీ చిత్రం కూడా లేదు. ఇక ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టాలని ఇప్పటికే అక్కడ భారీ బడ్జెట్ తో చిత్రాలు చేసినా అవి డిజాస్టర్లు నిలిచాయి. హృతిక్ ‘మహోంజదారో’ చిత్రం ఈ లిస్ట్ లో ముందుంటుంది.

ఇది పక్కన పెడితే… ‘కబీర్ సింగ్’ చిత్రం కూడా బాలీవుడ్ టాప్ 10 మూవీస్ లో ఉంది. విడుదలైన 13 రోజులకే 200 కోట్లకు పైగా కలెక్షన్లను వసూల్ చేసి 10వ స్థానాన్ని దక్కించుకుంది. తెలుగులో గేమ్ చేంజెర్ మూవీగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి.. ఇది రీమేక్. ఈ రీమేక్ ను తెరకెక్కించింది కూడా మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కావడం మరో విశేషం. ఇలా బాలీవుడ్లో అత్యధిక వసూళ్ళను రాబట్టిన టాప్ 10 సినిమాల లిస్ట్ లో మొదటి స్థానం, 10వ స్థానంలో ఉన్న సినిమాలు మన తెలుగు దర్శకుల పేరిట ఉండడం గర్వించదగ్గ విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus