ఇతర భాషల్లో సినిమాను తెరకెక్కించిన తెలుగు దర్శకులు

పర భాష దర్శకులు అనేకమంది తెలుగులో సినిమాలు తీసి విజయాలను అందుకున్నారు. తెలుగు దర్శకులు కూడా ఇతర భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించారు. కొంతమంది విజయాల్ని అందుకుంటే, మరికొంతమంది అపజయాలను చవిచూశారు. పరభాషలో సినిమాలు తీసిన మన డైరక్టర్స్ పై ఫోకస్..

కె.రాఘవేంద్ర రావుతెలుగు దర్శకుల గురించి ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కె.రాఘవేంద్ర రావు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకేంద్రుడు హిందీలోనూ బ్లాక్ బస్టర్ సినిమాలను డైరక్ట్ చేశారు. జస్టిస్ చౌదరి, హిమ్మత్ వాలా వంటి చిత్రాలతో సత్తా చాటారు.

దాసరి నారాయణ రావుసినిమాలకు కథే హీరో అని చాటి చెప్పిన డైరక్టర్ దాసరి నారాయణ రావు . దర్శక రత్నగా టాలీవుడ్ పిలుచుకునే ఈయన జాక్మి షేర్ , ప్యాసా సావాన్ వంటి మూవీస్ తో అక్కడ కూడా చక్రం తిప్పారు.

రామ్ గోపాల్ వర్మపర భాషల్లో అప్పుడప్పుడు సినిమాలు తీయడం అందరూ చేసే పని. అందుకు భిన్నంగా రామ్ గోపాల్ వర్మ సొంత భాషకంటే ఇతర భాషల్లోనే సినిమాలు తీస్తానని ప్రకటించి వార్తల్లోకి ఎక్కారు. రంగీలా, సత్య, బూత్, సర్కార్ .. ఇలా అనేక హిందీ చిత్రాలు తీసి బాలీవుడ్ డైరక్టర్ గా మారిపోయారు.

పూరి జగన్నాథ్తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హిట్ అందుకున్న మరో డైరక్టర్ పూరి జగన్నాథ్. ఈ స్పీడ్ డైరక్టర్ కన్నడలో “అప్పు” అనే మూవీని డైరక్ట్ చేశారు. హిందీలో ఏకంగా బిగ్ బీతో “బుడ్డహోగా తేరా బాప్” అనే ఫిల్మ్ తెరకెక్కించి అభినందనలు అందుకున్నారు.

కృష్ణవంశీక్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ తెలుగులో గులాబీ, మురారి, నిన్నే పెళ్లాడుతా వంటి అద్భుత చిత్రాలను తీశారు. ఈయన తెరకెక్కించిన అంతఃపురం ఇక్కడి ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ని ఆకర్షించింది. దీంతో బోనీ కపూర్, శ్రీదేవితో కలిసి ఈ చిత్రాన్ని “శక్తి”గా హిందీలో రీమేక్ చేశారు. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. ఈ మూవీ ఆశించినంతగా ఆడకపోవడంతో మళ్ళీ అటువైపు వెళ్ళలేదు.

మెహర్ రమేష్టాలీవుడ్ ప్లాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ కన్నడలో “వీర కన్నడీగా” అనే మూవీని డైరక్ట్ చేశారు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ విజయాన్ని అందుకుంది.

జేడీ చక్రవర్తివిలన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి హీరోగా మారి డైరక్టర్ అవతారమెత్తిన నటుడు జేడీ చక్రవర్తి. రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యుడిగా పలు సినిమాలకు పనిచేసిన ఈయన తెలుగుతో పాటు హిందీలోనూ పలు చిత్రాలను డైరక్ట్ చేశారు. దర్వాజా బంద్ రఖో, దుర్గ వంటి తక్కువ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించారు.

తేజకొత్త నటీ నటులతో ప్రేమకథలను అందంగా చూపించి భారీ హిట్స్ అందుకున్న డైరక్టర్ తేజ కోలీవుడ్ లో ఓ చిత్రం చేశారు. తెలుగులో జై గా చేసిన చిత్రాన్ని తమిళంలో జై రామ్ గా రీమేక్ చేశారు. ఇది హిందీలోనే కాకుండా దేశంలోని అనేక భాషల్లో డబ్ అయింది.

విజయ్ భాస్కర్నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావ్ తదితర చిత్రాల ద్వారా మంచి చిత్రాల దర్శకుడిగా గుర్తింపును అందుకున్న విజయ్ భాస్కర్ బాలీవుడ్ లోను మంచి చిత్రం తీశారు. రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా జంటగా ” తుజే మేరీ కసమ్” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. రామోజీ రావు నిర్మించిన ఈ ఫిల్మ్ విజయం సాధించింది.

క్రిష్గమ్యం, వేదం, కంచె వంటి విభిన్నమైన కథలతో చిత్రాలు తీసి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ శైలి ని ఏర్పరుచుకున్న డైరక్టర్ క్రిష్. ప్రస్తుతం గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కించిన ఈ డైరక్టర్ “గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ క్రిష్ కి మంచి పేరుని తీసుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus