స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉన్నప్పటికీ.. డైరెక్టర్ కు ముందుగా నిర్మాత దొరకాలి. అదే చాలా కష్టం. లేకపోతే దర్శకుడి దగ్గర ఉన్న కథ తెరపైకి వచ్చే అవకాశం లేదు. బహుశా అందుకేనేమో… టాలీవుడ్లో సక్సెస్ అయిన వెంటనే చాలా మంది దర్శకులు.. నిర్మాతలుగా, సహా నిర్మాతలుగా మారి వేరే దర్శకులతో సినిమాలు చేశారు. వాళ్ళు డైరెక్ట్ చెయ్యకుండా.. వేరే దర్శకుడితో సినిమాలు చెయ్యడం కూడా చాలా కష్టమైన పనే..! కాకపోతే స్క్రిప్ట్ పైన మేకింగ్ పైన.. పట్టు ఉంటుంది కాబట్టి మన టాలీవుడ్లో కొంతమంది డైరెక్టర్లు ధైర్యంగా ఆ స్టెప్ తీసుకున్నారని స్పష్టమవుతుంది.గతంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు కూడా పక్క దర్శకులతో సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్ళ సినిమాలకు నిర్మాతలతో వందల కోట్లు పెట్టించే దర్శకులు.. వాళ్ళు నిర్మించే సినిమాలను మాత్రం 10కోట్ల లోపే రూపొందిస్తున్నారు. వాళ్ళ బ్రాండ్ తో నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే లాభాలు పొందొచ్చు అనేది కూడా వారి ఆలోచన కావచ్చు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరో.. వాళ్ళు నిర్మించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) పూరి జగన్నాథ్ :
తన తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన ‘బంపర్ ఆఫర్’ చిత్రాన్ని నిర్మించాడు పూరి. జయ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకుడు.
2) ఎస్.ఎస్.రాజమౌళి :
‘అందాల రాక్షసి’ అనే చిత్రాన్ని సాయి కొర్రపాటి తో కలిసి నిర్మించాడు మన రాజమౌళి. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు.
3) రాంగోపాల్ వర్మ :
మన ఆర్జీవీ సార్ చాలా సినిమాలకు కథ అందించి నిర్మించాడు.అందులో హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన షాక్ కూడా ఒకటి.
‘
4) వై.వి.ఎస్.చౌదరి :
గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నిప్పు’ అనే చిత్రాన్ని తన ‘బొమ్మరిల్లు’ బ్యానర్ పై నిర్మించాడు దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి.
5) శేఖర్ కమ్ముల :
నటుడు అనీష్ కురివెళ్ల తెరకెక్కించిన ‘ఆవకాయ్ బిర్యాని’ ని దర్శకుడు శేఖర్ కమ్ములనే నిర్మించాడు.
6) క్రిష్ :
సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ‘అంతరిక్షం 900 KMPH’ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ నిర్మించాడు.
7) సంపత్ నంది :
నవీన్ గాంధీ డైరెక్షన్లో ఆది హీరోగా తెరకెక్కిన ‘గాలి పటం’ చిత్రాన్ని దర్శకుడు సంపత్ నందినే నిర్మించాడు.
8) సుకుమార్ :
‘కుమారి 21ఎఫ్’ ‘ఉప్పెన’ వంటి హిట్ చిత్రాలను దర్శకుడు సుకుమార్ నిర్మించాడు.
9) త్రివిక్రమ్ శ్రీనివాస్ :
నితిన్ హీరోగా కృష్ణ చైతన్య డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, నితిన్ లతో కలిసి నిర్మించాడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.
10) అనిల్ రావిపూడి :
ఇటీవల అనీష్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘గాలి సంపత్’ చిత్రాన్ని అనిల్ రావిపూడి నిర్మించాడు.
11) నాగ్ అశ్విన్ :
లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘జాతి రత్నాలు’ ని ‘స్వప్న సినిమా’ బ్యానర్ పై దర్శకుడు నాగ్ అశ్వినే నిర్మించాడు.అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు.