2010 – 2019 : అతి పెద్ద డిజాస్టర్ సినిమాలు?

  • December 28, 2019 / 05:15 PM IST

2010 నుండీ 2019 వరకూ మన తెలుగు సినిమా స్థాయి చాలా పెరిగింది. చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. గేమ్ చేంజర్ మూవీస్, పాత్ బ్రేకింగ్ మూవీస్ వంటివి ఎన్నో వచ్చాయి. అయితే అక్కడితో మనం సంతోషపడినా.. మనం భరించలేని ఎన్నో డిజాస్టర్ సినిమాలు ఈ ఏడాది వచ్చాయని మరోసారి గుర్తుచేసుకోవాల్సి ఉంది. భారీ హైప్ తో వచ్చి చతికిల పడ్డ సినిమాలు ఏంటి? బాక్సాఫీస్ వద్ద వాటి ఫలితాలు?

పీడ కలల్లాంటి ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) వరుడు (2010) : 5 రోజుల పెళ్ళి.. ఇంటర్వెల్ వరకూ హీరోయిన్ కనబడదు.. వినడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అందుకే బన్నీ ఓకే చేసాడేమో.. కానీ ఆడియన్స్ కు మాత్రం ఇరిటేషన్ వచ్చింది. అలా బన్నీ కెరీర్లో డిజాస్టర్ సినిమా అంటే.. గుణశేఖర్ తెరకెక్కించిన ‘వరుడు’ చిత్రమనే చాలా మంది చెబుతారు.

2) పులి (2010) : ‘ఖుషి’ సినిమాని మించి ఖుషీ చేయిస్తాడు అని ఆశించి వెళ్లిన పవన్ అభిమానుల పై డైరెక్టర్ ఎస్.జె.సూర్య కసి తీర్చుకున్నాడనే చెప్పాలి.

3) అనగనగా ఓ ధీరుడు (2011) : పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు.. ‘మగధీర’ సినిమా చూసి.. తరువాత ఈ సినిమా తీసి చేతులు కాల్చుకున్నట్టున్నారు. అయితే లక్ష్మీ మంచు నటన మాత్రం సూపర్ అనే చెప్పాలి.

4) శక్తి (2011) : మన మెహర్ రమేష్ ‘కంత్రి’ ఐడియాతో ఈ సినిమా తీసి… ఎన్టీఆర్ ని బాగా భయపెట్టాడు అని.. మొన్నటి ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రెస్ మీట్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. నిర్మాత అశ్వినీ దత్ ను నిండా ముంచేసిన సినిమా ఇది.

5) బద్రీనాథ్ (2011) : అల్లు అర్జున్ కెరీర్లో మరో ఆణిముత్యం ఈ సినిమా..! ఈ చిత్రం కూడా ‘మగధీర’ కి స్పూఫ్ లానే ఉంటుంది. ఈ చిత్రం కూడా బన్నీ కెరీర్లో పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి.

6) నిప్పు (2012) : మొహమాటానికి చేసాడో.. రెమ్యూనరేషన్ కోసం చేసాడో కానీ.. మన మాస్ మహా రాజ్ ఈ సినిమా చేసి చాలా తప్పు చేసాడు. నిర్మాత వై.వి.ఎస్ చౌదరి .. దర్శకుడు గుణశేఖర్ వరుస ప్లాపుల్లో ఉండడంతో ఈ సినిమాతో అయినా కోలుకుంటారు అనుకుంటే.. అంతకు మించిన ప్లాప్ ఇచ్చారు.

7) షాడో (2013) : విక్టరీ వెంకటేష్ కు మెహర్ అన్న ఇచ్చిన సన్ స్ట్రోక్. కోలుకోవడానికి చాలా టైం పట్టింది. ఇక ప్రొడ్యూసర్ అయితే చాన్నాళ్ల వరకూ అడ్రెస్ లేడు.

8) రామయ్యా వస్తావయ్యా(2013) : ఎన్టీఆర్ , హరీష్ శంకర్, దిల్ రాజు.. ఈ కాంబినేషన్ అంటే ఎలాంటి సినిమా ఎక్ష్పెక్ట్ చేస్తాం.. కానీ ఫుల్ రివర్స్.. ! సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

9) ఆగడు (2014) : ఒక వేళ అదే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేస్తే బాగా ఆడేదేమో..! దర్శకుడు శ్రీను వైట్ల డిజాస్టర్ జర్నీ ఇక్కడ నుండే మొదలైంది.

10) కిక్ 2 (2015) : ‘కిక్’ సీక్వెల్ అని చెప్పారు కానీ.. ‘కిక్2’ చిత్రం దానికి ఏమాత్రం ఈక్వల్ కాలేదు. కట్ చేస్తే దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత కళ్యాణ్ రామ్ లకు పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

11) సర్దార్ గబ్బర్ సింగ్ (2016) : ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇచ్చిన మన పవర్ స్టార్.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో బిస్కట్ వేసాడు.

12) బ్రహ్మోత్సవం (2016) : మంచి కాన్సెప్ట్.. సూపర్ హీరో.. పెద్ద క్యాస్టింగ్. కానీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్.. సీరియల్ చూసినా ప్రేక్షకులు ఇంత ఇరిటేట్ అవ్వరేమో అనేలా చేసింది. మహేష్ కెరీర్లో ఇదో పీడ కల లాంటి సినిమా అని చెప్పొచ్చు.

13) నక్షత్రం (2017) : కృష్ణవంశీ వంటి పెద్ద డైరెక్టర్ కదా అని మొహమాటం కొద్దీ మన తేజు.. సందీప్ లు ఈ సినిమాని ఒప్పుకున్నట్టు ఉన్నారు. వామ్మో.. ఈ సినిమాని అస్సలు భరించలేమండీ..!

14) స్పైడర్ (2017) : దర్శకుడు మురుగదాస్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది చెప్పండి.. తమిళ హీరోలతో అయితే ఎంటర్టైన్మెంట్ సినిమాలు.. మన తెలుగు హీరోలతో అయితే ఎక్స్ పెరిమెంట్ సినిమాలు. పాపం ఈసారి మన సూపర్ స్టార్ బలైపోయాడు.

15) అజ్ఞాతవాసి (2018) : ‘పవర్ స్టార్ 25వ సినిమా.. అందులోనూ గురూజీ (త్రివిక్రమ్) డైరెక్షన్. టాక్ తో సంబంధం లేదు.. రికార్డుల గురించే మాట్లాడుకోవాలి.. తప్ప.. అని ఫిక్సయ్యి సినిమాకి వెళితే.. ఏడుపొచ్చేసింది భయ్యా’ అని ఫీల్ అయిన అభిమానులు లేకపోలేదు. ఈసారి పింక్ రీమేక్ తో అయినా ఆ లోటుని తీర్చేస్తే అంతే చాలు.

16) నోటా (2018) : మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. తమిళ మార్కెట్ కోసం ఆశపడి ఈ సినిమా చేసాడేమో..! ఆనంద్ శంకర్ డైరెక్షన్ కనీసం తమిళ ఆడియన్స్ ను కూడా మెప్పించలేకపోయింది.

17) అమర్ అక్బర్ ఆంటోని (2018) : ‘రవితేజ నా ట్రబుల్ షూటర్’ అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన శ్రీను వైట్ల. ఆ ట్రబుల్ షూటర్ నే ట్రబుల్ లో పడేసాడు. ఈ సినిమా కూడా పెద్ద డిజాస్టర్.

18) శ్రీనివాస కళ్యాణం (2018) : ఈ సినిమా అప్పటి కాలం వారికి కొంత మందికి నచ్చింది. ‘శతమానం భవతి’ చిత్రానికి ‘నేషనల్ అవార్డు’ వచ్చింది కదా అని.. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకి కూడా నేషనల్ అవార్డు కొట్టాలి అనే తపనతో తీశారే తప్ప.. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడం మరిచిపోయారు.

19) వినయ విధేయ రామ (2019) : జనాలు మాత్రం లాజిక్ లెస్ సీన్లని ఎంత కాలం భరిస్తారు చెప్పండి..! ఏదో చరణ్ కాబట్టి కొద్దిగా కలెక్షన్లు వచ్చాయి కానీ.. లేకపోతే బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ కి పెద్ద నమస్కారం పెట్టాలి.

20) ఎన్టీఆర్ మహానాయకుడు (2019) : పెద్దాయన పరువు తీయడానికే ‘ఎన్టీఆర్ బయోపిక్’ తీసారా అనే అనుమానం సినిమా చూస్తున్నంత సేపు మనసులో వస్తూనే ఉంటుంది. ‘డైరెక్టర్ క్రిష్, హీరో బాలయ్య .. ఎందుకయ్యా ఇది.. అసలు ఈ సినిమా తీయకపోయినా బాగుండేది కదా’ అని అభిమానులు సైతం బాధపడ్డారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus