ఒకప్పుడు వంద కోట్లు వసూళ్లు అనేది తెలుగు హీరోలకు అందని ద్రాక్షే. అసలు సౌత్ ఇండియాలో ఒక్క రజిని కాంత్ తప్ప మరో హీరో ఆ ఫీట్ చేరుకోలేదు. ఆయన నటించిన చంద్రముఖి ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక తెలుగులో ఆ ఫీట్ అందుకున్న ఫస్ట్ హీరో రామ్ చరణ్. రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రం ఫస్ట్ 100కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఐతే ఈ మధ్య 100 కోట్లు అనేది తెలుగు హీరోలకు చాల కామన్ ఐపోయింది. ప్రభాస్ బాహుబలి చిత్రంతో, మహేష్ శ్రీమంతుడు, ఎన్టీఆర్ అరవింద సమేత, బన్నీ అల వైకుంఠపురంలో చిత్రాలతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు.
బాహుబలి లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని మినహా ఇస్తే రామ్ చరణ్ రంగస్థలం, మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురంలో చిత్రాలు 100 కోట్ల షేర్ సైతం దాటివేశాయి. ఒకప్పుడు జాతీయ స్థాయిలో మార్కెట్ ఉన్న బాలీవుడ్ హీరోలకు మాత్రమే ఈ స్థాయి కలెక్షన్స్ ఉండేవి. కానీ ఒక ప్రాంతీయ భాషా చిత్రాల హీరోలై కూడా టాలీవుడ్ హీరోలు సల్మాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, హ్రితిక్ వంటి స్టార్ హీరోల స్థాయి వసూళ్లను సాధిస్తున్నారు. అలాగే టాలీవుడ్ హీరోలు ఇతర పరిశ్రమలలో గుర్తింపు తెచ్చుకుంటూ మార్కెట్ పరిధి పెంచుకుంటున్నారు. ఇది టాలీవుడ్ కి శుభపరిణామం అని చెప్పాలి.
Most Recommended Video
ఒక చిన్న విరామం సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!