అప్పుడు ‘కె.జి.ఎఫ్’.. ఇప్పుడు ‘ఖైదీ’?

డబ్బింగ్ చిత్రాలు అయినా సరే కంటెంట్ ఉంటే.. టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ‘కె.జి.ఎఫ్’ , ‘ఖైదీ'(2019) చిత్రాలు ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయి. ప్రస్తుతం ‘కె.జి.ఎఫ్’ చిత్రానికి సీక్వెల్ అయిన ‘కె.జి.ఎఫ్2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘కె.జి.ఎఫ్’ సీక్వెల్ కు మరింత హైప్ పెంచడానికి అన్ని భాషల్లో పాపులర్ అయిన నటులను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు నుండీ కూడా రావు రమేష్ వంటి నటులను ఎంచుకున్నట్టు భోగట్టా..! ఇదిలా ఉండగా..

ఇప్పుడు ‘ఖైదీ’ చిత్రానికి కూడా సీక్వెల్ రాబోతుంది.గతేడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ‘జైలు నుండీ విడుదలైన ఓ ఖైదీ జీవితంలో ఓ రాత్రి పూట ఏమేమి సంఘటనలు చోటు చేసుకున్నాయి’ అనే పాయింట్ తో ఈ చిత్రం రూపొందింది. అయితే క్లయిమాక్స్ లో అసలు ఆ ఖైదీ జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే పాయింట్ ను సీక్వెల్ లో చూపించబోతున్నట్టు హింట్ ఇచ్చారు. నిజానికి అలా అయితే అది ‘ఖైదీ’ ప్రీక్వెల్ అవుతుంది.

సరే ఆ విషయాన్ని పక్కన పెడితే.. ‘ఖైదీ’ చిత్రంలో హీరో కార్తీ తప్ప.. ఒక్క తెలిసిన మొహం కూడా ఉండదు. అయితే ‘ఖైదీ2’ కి మాత్రం హైప్ పెంచే ఉద్దేశంతో తెలుగు హీరోని కూడా ఓ కీలక పాత్రకు తీసుకోబోతున్నారని సమాచారం. ఇక ‘ఖైదీ2’ లో హీరోయిన్ కూడా అవసరం. ఆ పాత్రకు కూడా తెలుగు హీరోయిన్ నే తీసుకోవాలని దర్శకుడు లోకేష్ కానగరాజన్ భావిస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus