Dasari Narayana Rao: ఆ అవమానం తట్టుకోలేక దాసరిని రాళ్లతో కొట్టాలనుకున్నాడట..!

టాలీవుడ్లో దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి ప్రత్యేక స్థానం ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పోయి దాదాపు 4 ఏళ్ళు పూర్తికావస్తోన్నప్పటికీ ఆయన గురించి ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. దాదాపు 150 సినిమాలు దర్శకత్వం వహించిన ఘనత దాసరి గారి సొంతం. అంతేకాకుండా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఎంతో మందికి పద్మ పురస్కారాలను అందించడంలో అలాగే నేషనల్ అవార్డ్స్ ఇప్పించడంలో కూడా ఆయన హస్తం ఉంది అన్నది బహిరంగ రహస్యమే. అంతటి గొప్ప దర్శకుడిని ఓ హీరో రాళ్ళతో కొట్టాలనుకున్నాడట. అతను మరెవరో కాదు జె.డి.చక్రవర్తి.

విలన్ రోల్స్ చేసి పాపులర్ అయిన జె.డి అటు తర్వాత హీరోగా మారి ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించి సూపర్ హిట్లు అందుకున్నాడు. అలాంటి హీరో దాసరి గారిని ఎందుకు కొట్టాలనుకున్నాడు? విషయంలోకి వెళితే.. దాసరి గారు పద్మ గారితో ప్రేమలో ఉన్న టైములో జె.డి వాళ్ళ నాన్నగారు సూర్యనారాయణ గారి సాయంతో ఆమెను పెళ్ళి చేసుకోగలిగారట. అటు తర్వాత దాసరిగారు ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయ్యారు. అలాంటి రోజుల్లో ఓసారి జె.డి.చక్రవర్తి వాళ్ళ నాన్నగారు దాసరి ఇంటికి వెళ్ళారట. ఆ టైములో దాసరి గారు ఏదో పనిలో ఉన్నారు కొంచెం సేపు వెయిట్ చేయండి..కలిసిన తర్వాత భోజనం చేసి వెళ్ళాలి అని పద్మ గారు అన్నారట.

అలా అన్న వెంటనే ఆమె లోపలికి వెళ్లిపోయారట.అయితే దాసరి గారు ఎంత సేపటికి జె.డి వాళ్ళ నాన్న గారిని కలవడానికి రాలేదట. దాంతో ఒకప్పటి దాసరి గారితో ఉన్న చనువు కారణంగా జె.డి వాళ్ళ నాన్నగారు వెళ్ళి ఆ డోర్ తీస్తే..లోపల ఉన్న దాసరి గారు ఆయన అసిస్టెంట్ అనుకుని ‘వాళ్ళు వెళ్ళిపోయారా?’ అని చూసుకోకుండా అన్నారట. ఆ మాటలు విన్న జే.డీ.చక్రవర్తికి విపరీతమైన కోపం వచ్చిందట.కలవడం ఇష్టం లేదు అంటే ముందుగా చెప్పేస్తే వెళ్లిపోయేవాళ్ళం కానీ అలా అవమానించిన దానికి..ఆ టైం లో నా చేతిలో రాయి ఉంటే కొట్టేయాలనిపించింది. అప్పుడు నా వయసు 11 ఏళ్ళు కాబట్టి అంత ఆవేశం ఉండేది… అంటూ ఓ సందర్భంలో స్వయంగా జె.డి చెప్పుకొచ్చాడు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus