ఏ రంగమైనా పోటీ ఉంటేనే కిక్ ఉంటుంది. సినిమా రంగం అందుకు మినహాయింపు కాదు. కానీ కలెక్షన్లతో కూడుకుంది కాబట్టి.. ఇందులో అనువైన సమయంలో రిలీజ్ చేసుకునే వెసులు బాటు ఉంది. అయినప్పటికీ మనహీరోలు ఒకే సారి బరిలోకి దిగుతున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో చిరు, బాలయ్య, శర్వానంద్ హిట్ అందుకోగా, ఆర్ నారాయణ మూర్తి మాత్రం యావరేజ్ తో సరిపెట్టుకున్నారు. అయితే ఇలాగే తమ సినిమాలు విజయం సాధిస్తాయని, గట్టి పోటీ ఉందని తెలిసినా స్వాతంత్ర దినోత్సవ వీకెండ్ కి నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, లై రిలీజ్ అయ్యాయి. ఇందులో రానా, శ్రీనివాస్ సినిమాలు విజయం సాధించాయి. లై బాగున్నప్పటికీ పోటీలో నిలబడలేక పక్కకు తప్పుకుంది. ఈ మూవీ సోలోగా వచ్చిఉంటే హిట్ అయ్యేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై చర్చ సాగుతున్న వేళ మరోసారి అదే తప్పు చేయడానికి మన హీరోలు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 8వ తేదీన ‘యుద్ధం శరణం’ ‘ఒక్కడు మిగిలాడు’,‘మేడమీద అబ్బాయి’, ‘వీడెవడు’ సినిమాల్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇది తెలిసిన సినీ పెద్దలు ఈ పోటీ అవసరమా ? అని హెచ్చరిస్తున్నారు . రెండు సినిమాలు ఇప్పుడు.. మరో వారంలో రెండు రిలీజ్ చేసుకొని కలక్షన్స్ పెంచుకోవచ్చుకదా అని సలహా ఇస్తున్నారు. మరి ఈ సలహాను ఆ చిత్ర నిర్మాతలు పాటిస్తారో, లేదో చూద్దాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.