Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త కోణం..!

టాలీవుడ్లో కొంతమంది హీరోలు రైటర్లుగా మారబోతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపిస్తుందేమో కానీ.. గతంలో చాలా మంది హీరోలు రైటర్ల అవతారం ఎత్తిన విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి.సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు,కృష్ణ వంటి స్టార్లు తమ సినిమాలకు రైటర్లుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పటి రోజుల్లో అయితే పవన్ కళ్యాణ్, నాగ శౌర్య వంటి హీరోలు తమ సినిమాలకు కథలు రాసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మరికొంతమంది హీరోలు కూడా చేరనున్నారు. వారెవరంటే :

నాని :

కెరీర్ ప్రారంభంలో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.ఇతనికి ద‌ర్శ‌క‌త్వం వైపు మక్కువ ఉన్నా – ఇప్ప‌ట్లో దాని జోలికి పోకూడదని డిసైడ్ అయ్యాడు. కానీ నిర్మాత‌గా సినిమాలు చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. నాని ఓ క‌థ రెడీ చేసుకున్నాడట. త‌న సొంత బ్యానర్లో ఈ కథని తెరకెక్కించాలని నాని ఆలోచన. అందుకోసం దర్శకుడిని వెతుకుతున్నాడట.

అల్ల‌రి న‌రేష్ :

తన తండ్రి ఇవివి సత్యనారాయణ గారి దగ్గర ఎన్నో సినిమాలకి రైటర్ గా పనిచేసాడు అల్లరి నరేష్. అంతేకాదు తన సినిమాలకి రైటర్ గా కూడా పనిచేసాడట.న‌రేష్ కూడా ఓ క‌థని రెడీ చేసుకున్నాడు. దీన్ని తెరపైకి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాడట.

మోహన్ బాబు:

మోహన్ బాబులో కూడా రైటర్ ఉన్నాడు.అప్పుడప్పుడు తన సినిమాలకు ఈయన స్క్రీన్ ప్లే అందిస్తుంటారు అని వినికిడి.ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘స‌న్ ఆఫ్ ఇండియా’ కి క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారట.

ర‌వితేజ :

నాని లానే రవితేజ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వాడే.ఇతని దగ్గర కూడా కొన్ని క‌థ‌లు రెడీగా ఉన్నాయి. వాటిని డైరెక్ట్ చేసే ఉద్దేశం ప్రస్తుతానికి అయితే అతనికి లేదు కానీ నిర్మాతగా మారి వాటిని రూపొందించాలని ప్రయత్నిస్తున్నాడట.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus