Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్
- May 6, 2026 / 04:05 PM ISTByPhani Kumar
సినీ రంగంలో సెంటిమెంట్స్ కి కొదవే ఉండదు. ఇక్కడ ఎవరి లెక్కలు ఎప్పుడు ఎలా మారతాయో అంచనా వేయడం చాలా కష్టం. ముఖ్యంగా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లకు వరుస ఫ్లాపులు పలకరిస్తే.. వెంటనే వారికి ఇచ్చే లెక్కలు, అలాగే వారి స్ట్రాటజీలు మారిపోతుంటాయి.
Tollywood
ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో(Tollywood) ఒక టాప్ హీరోయిన్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది.గతేడాది వరకు వరుస అవకాశాలతో ఓ ఊపు ఊపేసిన ఓ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్, ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది.

దీనికి ప్రధాన కారణం ఆమె రీసెంట్ మూవీస్ అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం వల్లనే.! అయితే ఈ పరాజయాలకు కారణం కేవలం ఆమె నటన మాత్రమే కాదు, కథల ఎంపికలో జరిగిన తప్పిదాలే అని ఆమె గ్రహించిందట.ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఆ హీరోయిన్ కెరీర్ ప్రారంభం నుండి ఆమె తల్లి గారే అన్ని వ్యవహారాలు చక్కబెడుతుంది. రెమ్యూనరేషన్, బ్యానర్స్ వంటివి చూసి వరుసగా ప్రాజెక్టులకి సైన్ చేయించేస్తుంది హీరోయిన్ తో..!
ఈ కారణంగా ఆ హీరోయిన్ కెరీర్ రిస్క్‌లో పడింది. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ కూడా గ్రహించినట్టు తెలుస్తోంది. అలాగే తన తల్లితో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చినట్లు టాక్. భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదు అనే ఉద్దేశంతో ఒక ‘స్క్రిప్ట్ కన్సల్టెంట్’ను నియమించుకుందట ఆ హీరోయిన్. ఆమె పాత్ర, కథ వంటివి అతను వినే ఫైనల్ చేస్తాడు. కానీ పారితోషికాల లెక్కల పని మాత్రం మళ్ళీ తన అమ్మకే అప్పగించిందట ఆ టాప్ హీరోయిన్.
సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?
















