Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

Advertisement

అదొక చిన్న సినిమా. దర్శకుడికి డెబ్యూ మూవీ కూడా! అయితే, సినిమా పూర్తయ్యాక రిలీజ్ చేయడానికి డబ్బుల్లేవని నిర్మాత చేతులెత్తేశాడు. దీంతో తన మొదటి సినిమా ఎలాగైనా థియేటర్లలోకి రావాలనే పట్టుదలతో.. దర్శకుడే స్వయంగా డబ్బులు సర్దుబాటు చేసుకుని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాడు.

Tollywood

ఇండస్ట్రీలో(Tollywood) ఉన్న తన ఫ్రెండ్స్ సర్కిల్‌ను ఉపయోగించి రిలీజ్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు.కానీ, సినిమాను కేవలం రిలీజ్ చేస్తే సరిపోదు కదా..!

దానికి సరైన ప్రమోషన్స్ కూడా చేయాలి! రిలీజ్ కి ముందు హీరో, హీరోయిన్లను ప్రమోషన్స్‌కి తీసుకువస్తేనే మీడియా అటెన్షన్ వస్తుంది.! అప్పుడు జనాల్లోకి కూడా పలానా సినిమా ఒకటి వస్తుంది అని తెలుస్తుంది. అందుకోసం హీరోని ఎలాగోలా ఒప్పించాడు. కానీ హీరోయిన్‌ను ఒప్పించడమే పెద్ద టాస్క్‌గా మారింది. ఎందుకంటే ఆ దర్శకుడికి హిందీ, ఇంగ్లీష్ రావు.! దీంతో తన పీఆర్ సాయంతో ఎలాగోలా హీరోయిన్‌ను సంప్రదించి, ప్రమోషన్స్‌కి వచ్చేలా ఒప్పించాడు.

హీరోయిన్ తో పాటు ఆమె తల్లి కూడా వస్తుంది అనే కండీషన్ పైనే ప్రమోషన్స్ కి అంగీకరించిందట.దర్శకుడి చేతిలో వేరే ఆప్షన్ లేదు కదా… సరే అనక తప్పలేదు.ఇక ప్రమోషన్స్ కోసం సదరు హీరోయిన్‌కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేందుకు దర్శకుడు ఏర్పాట్లు మొదలుపెట్టాడు. ముందుగా ఆమె కోసం ఒక డీసెంట్ హోటల్‌లో రూమ్ బుక్ చేయించాడు. ఆ తర్వాత ఫ్లైట్ టైమింగ్స్ కనుక్కోవడం కోసం హీరోయిన్‌కి ఫోన్ చేసి, హోటల్ రూమ్ వివరాలను పీఆర్ ద్వారా చెప్పించాడు. అంతే.. ఆ వివరాలు వినగానే సదరు హీరోయిన్ పెద్ద రభస చేసిందట.

తాను సాధారణ హోటల్‌లో అసలు ఉండనని గట్టిగా అరిచి ఫోన్ పెట్టేసిందట.దర్శకుడు మళ్లీ ఫోన్ చేసి బ్రతిమిలాడితే.. ‘స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేస్తేనే నేను ప్రమోషన్స్‌కి వస్తాను.. లేదంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయకండి, నేను రాను’ అని తెగేసి చెప్పేసిందట. చేసేదేమీ లేక ఆ దర్శకుడు స్టార్ హోటల్‌లోనే రూమ్ బుక్ చేయడానికి రెడీ అయ్యాడు. కానీ, అతనికి ఆన్‌లైన్‌లో హోటల్ రూమ్ బుక్ చేయడం కూడా రాదట.

దీంతో మళ్లీ పీఆర్ సాయంతో స్టార్ హోటల్ బుక్ చేయించి, ఆ వివరాలు పంపిన తర్వాతే సదరు హీరోయిన్ కూల్ అయ్యి ప్రమోషన్స్‌కి వచ్చిందట.ఇలాంటి ఎన్నో సమస్యలు దాటి దర్శకుడు సినిమాని రిలీజ్ చేసుకున్నాడు.పెద్ద సినిమాలకైతే నిర్మాతలు ఖర్చుకు వెనకాడరు కాబట్టి హీరోయిన్ల లగ్జరీలను భరిస్తారు. పైగా ఈ రూమ్ బుకింగ్స్, ట్రావెలింగ్ వ్యవహారాలన్నీ మేనేజర్లు చక్కబెట్టాలి. కానీ, ఇక్కడ దర్శకుడి బడ్జెట్ సమస్యలు తెలుసు కదా.!

అందుకే పీఆర్ ని వాడుకున్నాడు. ఇవి చాలదన్నట్టు, ఆ దర్శకుడికి భాషతో పాటు చదవడం, రాయడం కూడా సరిగ్గా రాకపోవడంతో.. రిలీజ్ విషయంలో(అగ్రిమెంట్లు చేసుకునేప్పుడు) హెల్ప్ చేస్తానంటూ ముందుకొచ్చిన మరో దర్శకుడు, అతని టీం కూడా బడ్జెట్ విషయంలో కొంత మొత్తం నొక్కేసినట్టు ఇండస్ట్రీ టాక్. చిన్న సినిమాలకి కూడా బడ్జెట్లు ఎందుకు పెరిగిపోతాయి అనడానికి ఇదొక లైవ్ ఎగ్జామ్పుల్.

‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus