గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన ఆర్టిస్ట్ జాన్ కొట్టొలీ

  • January 29, 2020 / 03:12 PM IST

“జాన్ కొట్టొలీ”.. ఈ పేరు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళకి కానీ, సినిమాలు చూసేవారికి కానీ తెలియదు. అయితే.. ప్రతి థియేటర్ ఆర్టిస్ట్ & ఇండిపెండెంట్ ఫిలిమ్ మేకర్స్ కి జాన్ ఒక స్పూర్తి. ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా తన తోటి నటీనటులను, ఫిలిమ్ మేకర్స్ ను జాన్ ఎంకరేజ్ చేసిన విధానం ప్రశంసనీయం. “మను, ఫలక్ నుమా దాస్” వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషించడంతోపాటు.. “గాడ్స్ ఆఫ్ ధర్మపురి” అనే తెలుగు వెబ్ సిరీస్ లో కీలకపాత్ర పోషించిన జాన్ కొట్టోలీ నిన్న ఉదయం గుండెపోటుతో మరణించారు.

జనాలకి పెద్దగా తెలియని నటుడు కావడంతో ఆయన మరణం పెద్ద వార్త కాలేకపోయింది. కానీ.. టాలీవుడ్ మాత్రం మంచి నటుడ్ని కోల్పోయింది. టాలీవుడ్ లో ఉన్న అతితక్కువ మెథడ్ యాక్టర్స్ లో జాన్ ఒకరు. ఇప్పుడిప్పుడే నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న జాన్.. ఇంకో అయిదేళ్లు బ్రతికి ఉంటే బిజీ ఆర్టిస్ట్ అయ్యేవారు.. కానీ ఆయన ఆకస్మిక మరణం ఇండిపెండెంట్ ఫిలిమ్ మేకర్స్ & ఆయనతో అసోసియేట్ అయిన వారికి తీరని లోటు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus