Tollywood: నాన్ పాన్ ఇండియా రికార్డ్స్.. ఆ ఇద్దరితో పాటు మెగాస్టార్

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలన్నీ పాన్ ఇండియా బాట పడుతున్న తరుణంలో, కేవలం ప్రాంతీయ భాషా చిత్రంగా విడుదలై వందల కోట్ల వసూళ్లు రాబట్టడం ఒక అద్భుతమని చెప్పాలి. తన లేటెస్ట్ సెన్సేషన్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో చిరంజీవి కేవలం తెలుగు వెర్షన్‌తోనే సరికొత్త రికార్డులను సృష్టించి, తన మాస్ స్టామినాను నిరూపించుకున్నారు.

Tollywood

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ పాన్ ఇండియా చిత్రాల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ పేరిట ఉన్న రూ. 251 కోట్ల రికార్డును చిరంజీవి కేవలం 13 రోజుల్లోనే అధిగమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 260 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది.

సంక్రాంతి సెలవులు ముగిసినా ఈ సినిమాపై ఆడియన్స్ చూపిస్తున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నిన్న శనివారం ఒక్కరోజే బుక్‌మైషో ప్లాట్‌ఫామ్‌లో ఏకంగా లక్షకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం మెగాస్టార్ క్రేజ్‌కు నిదర్శనం. టాలీవుడ్ టాప్ రీజినల్ గ్రాసర్స్ జాబితాలో ఇప్పుడు మెగాస్టార్ మొదటి స్థానంలో నిలవగా, గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 245 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని నేటితరం ప్రేక్షకులకు నచ్చేలా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా తీర్చిదిద్దారు. చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్, ఫ్యామిలీ సెంటిమెంట్ పర్ఫెక్ట్‌గా కుదరడంతో మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. హిందీ మార్కెట్‌పై ఆధారపడకుండా కేవలం తెలుగు గడ్డ మీద ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అనేది తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. ఇక టోటల్ గా ఈ లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus