Most Viewed Trailers: ‘పుష్ప 2’ తో పాటు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని నమోదు చేసిన 10 ట్రైలర్లు!

ఓ సినిమాకి పబ్లిసిటీ బాగా జరగాలి అంటే అది ట్రైలర్ తోనే అని చెప్పడంలో సందేహం లేదు. ట్రైలర్ కట్ ఎంత బాగా ఉంటే.. అంత ఎక్కువ మంది చూస్తారు. అంత కంటే ఎక్కువగా దాని గురించి మాట్లాడుకుంటారు. ఇక ఆ ట్రైలర్ కి వచ్చిన వ్యూస్ ని బట్టి.. సినిమాకి ఏ రేంజ్ హైప్ ఉంది? ఓపెనింగ్స్ ఎంత వరకు రావచ్చు? అనే విషయం పై కూడా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఈ యూట్యూబ్లో ట్రెండ్ అయ్యే ట్రైలర్ ఫీడ్ వైరల్ అవ్వడానికి కూడా షేర్లు వంటివి ఎక్కువ జరగాలి. ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలకే అది సాధ్యమవుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం యూట్యూబ్లో పుష్ప గాడి రూల్ నడుస్తుంది. అదేనండీ.. నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప 2′(ది రూల్) (Pushpa 2: The Rule) ట్రైలర్ గురించి చెబుతున్నాను. ‘పుష్ప’ (Pushpa)  సినిమా హిట్ అవ్వడంతో దాని పై ఏ రేంజ్లో హైప్ ఉంటుందో అందరికీ ఓ క్లారిటీ ఉంది. ఆ అంచనాలకు తగ్గట్టు ఈ ట్రైలర్ కట్ ఉంది.

Most Viewed Trailers

అల్లు అర్జున్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని పుష్ప రాజ్ పాత్రని హైలెట్ చేస్తూ చాలా మాస్ ఎలిమెంట్స్ దట్టించారు. అలాగే కథ ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ ఇచ్చారు. పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్, పుష్ప అంటే ఫైర్ మాత్రమే కాదు వైల్డ్ ఫైర్ వంటి డైలాగులు కూడా బాగా పేలాయి. అందుకే యూట్యూబ్లో ‘పుష్ప 2’ ట్రైలర్ రికార్డుల మీద రికార్డులు కొడుతోంది. ఇక 24 గంటల్లో ఈ ట్రైలర్ 44.67 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టి.. నెంబర్ వన్ ప్లేస్ ను కైవసం చేసుకుంది. దీనికి ముందు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ట్రైలర్ నెంబర్ వన్ ప్లేస్లో ఉండేది. ఇక వీటితో పాటు టాప్ 10 లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

1) పుష్ప 2 ది రూల్ :

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) -సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో ‘పుష్ప'(ది రైజ్) కి కొనసాగింపుగా తెరకెక్కిన ‘పుష్ప 2’ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో ఏకంగా 44.67 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టి నెంబర్ 1 ప్లేస్ ని కొల్లగొట్టింది.

2) గుంటూరు కారం :

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ 24 గంటల్లో 37.65 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టి టాప్ 2 స్థానాన్ని దక్కించుకుంది.

3) సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar) :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) , ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ 24 గంటల్లో 32.58 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది.

4) సర్కారు వారి పాట ( Sarkaru Vaari Paata) :

మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ (Parasuram) పెట్ల(బుజ్జి) కలయికలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 26.77 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది.

5) రాధే శ్యామ్ (Radhe Shyam) :

ప్రభాస్, దర్శకుడు రాధా కృష్ణ కుమార్ (Radha Krishna Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 23.20 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది.

6) ఆచార్య (Acharya) :

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రానికి కొరటాల శివ (Koratala Siva) దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 21.86 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి

7) బాహుబలి2 (Baahubali 2) :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,దర్శకధీరుడు రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం విడుదలైన 24 గంటల్లో 21.81 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది.

8) సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (రిలీజ్ ట్రైలర్) :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 21.70 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టింది.

9) ఆర్.ఆర్.ఆర్ (RRR) :

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్..హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 20.45 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది.

10) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 (KGF 2 ) :

పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ (Yash) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 19.38 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus