రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధమయిన ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ

జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందా? అని అభిమానులు ఎదురుచూసారు. ఆ తరుణం రానే వచ్చింది. రేపటి నుంచి ఈ మూవీ మొదటి షెడ్యూల్ మొదలు కానుంది. ఈనెల 25  వరకు సాగే  ఈ షెడ్యూల్ ల్లో యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేయనున్నారు. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ చిత్రీకరించనున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా కోసం తారక్ గత మూడు నెలలుగా కఠోర శ్రమ చేశారు. ఆ ఫలితం లుక్ రూపంలో కనిపిస్తూనే ఉంది.

పదికిలోలు తగ్గి ఫిట్ గా తయారయ్యారు. ఈ లుక్ అభిమానులకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాలో మరింత అందంగా త్రివిక్రమ్ చూపిస్తారని అందరూ  నమ్మకంతో ఉన్నారు. మాటల మాంత్రికుడి గత చిత్రం అజ్ఞాతవాసి అపజయం పాలవడంతో.. ఈ సినిమాని  అటువంటి పొరపాట్లు చేయకుండా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఎస్.ఎస్.  థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జిగేల్ రాణి పూజా హెగ్డే నటించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus