సినిమా పరిశ్రమలో నవరసాల పాత్రలు చేసిన వారే బడా హీరోలుగా ఎదిగారు. అయితే ముఖ్యంగా పౌరాణిక పాత్రలు, సాంఘిక కధలు, జానపద పాత్రల్లో జీవించిన వారే టాలీవుడ్ ను ఏలారు. అయితే అప్పటి సినిమాల్లో శివుని పాత్రకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు…అందులోనూ ఆ పాత్రలో ఒదిగి పోవాలి అంటే ఎన్నో ప్రత్యేక లక్షణాలు కావాలి. మరి అలాంటి లక్షణాలు కలిగి, తెలుగు చిత్ర పరిశ్రమలో శివుని పాత్రలో శివతాండవం చేసిన మన వారిపై ఒక స్టోరీ చూద్దాం రండి.
నందమూరి తారక రామారావు – దక్షయజ్ఞం!దక్షయజ్ఞం చిత్రంలో దక్షుడిగా ఎస్వీ. రంగారావు గారు నటించగా, శివుని పాత్రలో నటించి మెప్పించి, మురిపించారు ఎన్టీఆర్ గారు. అయితే ఈ ఇద్దరి లెజెండ్స్ అసామాన్య నటనతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్న, కొన్ని అనుకోని సంఘటనలు ఎదురుకావడంతో ఈ సినిమా తరువాత మళ్లీ అన్నగారు శివుని పాత్ర చెయ్యలేదు.
కృష్ణం రాజు – రంగూన్ రౌడీ, శ్రీ వినాయక విజయం!రెబెల్ స్టార్ గా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరుగా చాలామణీ అయిన కృష్ణం రాజు గారు, దాదాపుగా రెండు సినిమాల్లో శివుని పాత్రలో నటించి మెప్పించారు. అందులో మొదటిది రంగూన్ రౌడీ కాగా, రెండో చిత్రంగా శ్రీ వినాయక విజయం మంచి విజయాలు సాధించాయి. అదే క్రమంలో శివుని భక్తుడుగా భక్త కన్నప్ప పాత్రలో సైతం కృష్ణం రాజు నటించి మెప్పించారు.
చిరంజీవి – శ్రీమంజునాధ!మెగాస్టార్ చిరంజీవి సైతం శివుని పాత్రలో నటించి మెప్పించారు. శ్రీమంజునాధ చిత్రం చిరు శివుని పాత్రలో శివతాండవం చేశారు. ముఖ్యంగా ఆ చిత్రంలో చిరు నటనతో పాటు, అందం, పాటల్లో చిరు చేసిన నృత్యాలు అభిమానులను అలరించాయి.