కరోనా దెబ్బకు చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సీని వరల్డ్ లో ఓటీటీ అప్గ్రేడ్ అవ్వడం కొందరిని కంగారు పెడుతోంది. థియేట్రికల్ బిజినెస్ పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అర్ధమవుతోంది. కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే థియేటర్ వాతావరణం సెట్టయ్యే రోజులు రానున్నట్లు అర్ధమవుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని రకాల సినిమాలను లాగేసుకోవడానికి ఓటీటీ సంస్థలు గట్టిగానే ఫోకస్ పెట్టాయి.
అయితే చాలామంది నిర్మాతలకు నచ్చే ఫిగర్ ఎంత పెంచినా కూడా టెంప్ట్ అవ్వడం లేదట. లవ్ స్టొరీ , సీటిమార్ వంటి సినిమాలకు మొదటి నుంచి చాలా రకాల ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. అదే తరహాలో ఇటీవల ఖిలాడి సినిమాకు 40కోట్లకు పైగా ఆఫర్ చేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, దృశ్యం 2, విరాటపర్వం, వంటి సినిమాలకు కూడా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి బడా సంస్థలు బడ్జెట్ కంటే డబుల్ ఎమౌంట్ ను ఆఫర్ చేశాయట.
ఇక రాధే లాంటి పెద్ద సినిమా తరహాలోనే ప్రభాస్ రాధేశ్యామ్ ను కూడా పే పర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేసుకునేందుకు కూడా ఓటీటీ సంస్థలు ఎర వేశాయి. కానీ ఎమౌంట్ ఎంత పెరిగినా కూడా ప్రొడక్షన్ హౌజ్ లు కొంచెం కూడా టెంప్ట్ అవ్వడం లేదు. ప్రతి ఒక్కరు కూడా థియేటర్లలోనే రిలీజ్ చేసి బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. కానీ అన్ని సినిమాలు అంతగా క్లిక్కవ్వకపోవచ్చు. మరి కొందరి మొండిపట్టు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.