‘మేజర్’ తో పాటు ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 12 సినిమాల లిస్ట్..!

  • June 3, 2022 / 03:33 PM IST

‘జై జవాన్ జై కిసాన్’ అంటూ పెద్దవాళ్ళు, టీచర్లు చెబుతూ ఉంటారు. వాళ్ళు లేకపోతే సామాన్యులకి బ్రతుకు ఉండదు. రైతు కష్టపడి పొలంలోకి వెళ్లి 5 వేళ్ళు మట్టిలో పెడితేనే.. మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. అలాగే సరిహద్దుల్లో మన ఇండియన్ ఆర్మీ పగలు, రాత్రి.. తిండి.. నిద్ర మానేసి కాపలా కాస్తేనే మనం ఇక్కడ జాలీగా తిరుగుతున్నాం, తిరగగలుగుతున్నాం. సినిమాల ద్వారానో, స్పోర్ట్స్ ద్వారానో మనల్ని అలరించే వారికి కోట్లకి కోట్ల రూపాయలు ఇచ్చి ప్రభుత్వాలు సత్కరిస్తూ ఉంటాయి. వాళ్ళ ఫోటోలు టీవీల్లో, పేపర్లో, సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉంటాయి. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల పేర్లు మాత్రం ఎక్కువగా కనబడవు. వాళ్లకు కోట్లకి కోట్లు డబ్బు కూడా దక్కదు.

ఇది తెలిసినా కూడా దేశం కోసం అన్నిటినీ త్యాగం చేసి సైనికులు సరిహద్దుల్లో కాపలా కాస్తుంటారు.సంవత్సరంలో ఒక నెల లేదా రెండు నెలలు మాత్రమే వాళ్ళ ఊరికి, ఇంటికి వచ్చి.. ఆ జ్ఞాపకాలతో సంవత్సరం మొత్తం గడుపుతూ ఉంటారు. అయితే ఎలాంటి గొప్ప విషయాన్ని అయినా అందరికీ చేరవేసేది సినిమానే కాబట్టి.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వంటి వారి బయోపిక్ లు కూడా రూపొందుతున్నాయి.’మేజర్’ లానే టాలీవుడ్లో ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సినిమాలు ఏంటో? వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) విజయేంద్ర వర్మ :

బాలకృష్ణ హీరోగా అంకిత, లయ,సంగీత హీరోయిన్లుగా స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిందే. 2004లో విడుదలైన ఈ మూవీ ప్లాప్ అయ్యింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.

2) స్టాలిన్ :

ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకుంది. 2006 లో ఈ మూవీ విడుదలైంది.

3) పరమ వీర చక్ర :

బాలకృష్ణ హీరోగా అమీషా పటేల్, షీలా కౌర్, నేహా ధూఫియా లు హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. 2011 లో ఈ మూవీ విడుదలైంది.

4) తుపాకీ :

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ మూవీ కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ హిట్ అయ్యింది.2012 లో ఈ మూవీ విడుదలైంది.

5) కంచె :

వరుణ్ తేజ్- క్రిష్ కాంబినేషన్లో 2015లో వచ్చిన ఈ మూవీ కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఈ మూవీ కొంతవరకు ఓకె అనిపించింది.

6) మెహబూబా :

పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరితో తెరకెక్కించిన ఈ మూవీ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. 2018 లో ఈ మూవీ విడుదలైంది.

7) నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా :

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా 2018లోనే వచ్చింది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

8) వెంకీ మామ :

వెంకటేష్- నాగ చైతన్య నటించిన ఈ మూవీలో కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. 2019లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

9) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది.2020 లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

10) మేజర్ :

అడివి శేష్ హీరోగా సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది.

11) జన గణ మన (జె.జి.ఎం) :

విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది.

12) సీతా రామం :

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus