టాలీవుడ్ నంబర్ వన్ మహేషే..ఇదే ప్రూఫ్..!

  • January 25, 2020 / 04:58 PM IST

టాలీవుడ్ లో మహేష్ తిరుగులేని స్టార్ అని నిరూపించుకుంటున్నారు. ఆయన వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. ఆయన నటించిన గత మూడు చిత్రాలైన భరత్ అనే నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ గా నిలిచాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ఆయన నైజాం కింగ్ గా అవతరించాడు. నైజాంలో నాలుగు 20ప్లస్ క్రోర్స్ షేర్ సాధించిన హీరోగా మహేష్ ఉన్నారు. ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరో మహేష్ కావడం విశేషం. ఇక యూఎస్ లో మూడు $2 మిలియన్ వసూళ్లు సాధించిన చిత్రాలు మహేష్ ఖాతాలో ఉన్నాయి. గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను $2మిలియన్ వసూళ్లు సాధించగా సరిలేరు నీకెవ్వరు మూడో చిత్రంగా నిలిచింది.

ఈ విధంగా మహేష్ వరుస విజయాలు అందుకుంటూ టాలీవుడ్ లో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. ఆయన రెమ్యూనరేషన్ కూడా 50కోట్లకు చేరింది. సౌత్ లో రజిని మినహా ఏ స్టార్ హీరో ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. నెక్స్ట్ ఆయన వంశీ పైడిపల్లితో చేస్తున్న చిత్ర బడ్జెట్ కూడా భారీగా ఉండనుందని తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ కుటుంబంతో కలిసి అమెరికా విహార యాత్రలో ఉన్నారు. దాదాపు రెండునెలల వరకు ఈ వెకేషన్ కొనసాగనుంది. టూర్ నుండి తిరిగి వచ్చిన వెంటనే మహేష్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus