Tollywood: టాప్7 రీరిలీజ్ సినిమాల కలెక్షన్ల లెక్కలు ఇవే.. ఆ స్టార్ హీరోలే టాప్!

  • April 27, 2024 / 12:43 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్, పాపులారిటీ ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇతర భాషలపై కూడా దృష్టి పెడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలను రీరిలీజ్ చేయడానికి కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ హీరోల రీరిలీజ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇతర భాషల్లో సైతం ఈ ట్రెండ్ మొదలైంది. అయితే సౌత సినిమాల్లో ఏ సినిమా ఏ స్థాయిలో రీరిలీజ్ లో కలెక్షన్లను సాధించిందో ఇప్పుడు చూద్దాం.

రీరిలీజ్ రికార్డ్ లలో మొదటి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) నటించిన గిల్లీ (Ghilli) మూవీ ఉంది. ఈ సినిమాకు 6 రోజుల్లో దాదాపుగా 18 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రీరిలీజ్ సినిమాలలో ఇది రికార్డ్ అనే చెప్పాలి. విజయ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల తమిళనాడు రాష్ట్రంలో ఊహలకు అందని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్ల లెక్క తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

పవన్ (Pawan Kalyan) ఖుషి (Kushi) రీ రిలీజ్ కలెక్షన్లు 7.46 కోట్ల రూపాయలు కాగా మహేష్ (Mahesh Babu) బిజినెస్ మేన్ (Businessman) రీ రిలీజ్ లో దాదాపుగా 6 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. స్పదికం అనే మలయాళ మూవీ రీ రిలీజ్ లో 5 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) సింహాద్రి (Simhadri) రీ రిలీజ్ కలెక్షన్లు 4 కోట్ల 60 లక్షల రూపాయలుగా ఉండటం గమనార్హం.

ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi)  సినిమాకు మూడున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా సూర్య (Suriya) సన్నాఫ్ కృష్ణన్ సినిమాకు 3 కోట్ల 40 లక్షల రూపాయలు కలెక్షన్లు వచ్చాయి. అయితే స్టార్ హీరోల సినిమాలలో చాలా సినిమాలు రీరిలీజ్ లో కోటి రూపాయల కలెక్షన్లు కూడా సాధించలేకపోయాయి. భవిష్యత్తులో రీరిలీజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను అందుకుంటాయో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus