‘ఆహా’ ఏమన్నా ప్లానా… స్టార్లు వరుస కడుతున్నారు

ఏదైనా షోకి యాంకర్లు హోస్ట్‌ చేస్తే స్టార్‌ హీరోలు రావడం సాధారణం… అదే స్టార్లు హోస్ట్‌ చేస్తే… అదిరిపోయే స్టార్లు రావాల్సి ఉంటుంది. అందులోనూ సమంత లాంటి సూపర్‌స్టార్ ఓ షో హోస్ట్‌ చేస్తోందంటే… ఇంకెంత మజా ఉండాలి. అందుకు తగ్గట్టే నడుస్తోంది ‘సామ్‌ జామ్‌’. ‘ఆహా’ వేదికగా నడుస్తున్న ఈ షోలో ఇప్పటివరకు నలుగురు గెస్ట్‌లు.. నిజానికి ఐదుగురు గెస్ట్‌లు వచ్చారు. అందులో ఎవరికివారు వాళ్ల రంగాల్లో తోపులు. ఇప్పుడు రాబోయే గెస్ట్‌లు అంతకుమించి ఉండబోతున్నారేది అసలు విషయం.

గత రెండు రోజులుగా ట్విటర్‌లో ‘సామ్‌ జామ్‌’ ట్రెండింగ్‌లో ఉంటోంది. కారణం తర్వాతి ఎపిసోడ్‌లలో వస్తున్న గెస్ట్‌ల సమాచారం. రెండు రోజుల క్రితం ‘సామ్‌జామ్‌’లో నాగచైతన్య అంటూ కొన్ని ఫొటోలు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత అది నిజమని తేలిపోయింది. మళ్లీ నిన్న అల్లు అర్జున్‌ ఫొటోలు చక్కర్లు కొట్టాయి. సాయంత్రానికి షో స్టేజీ మీద అల్లు అర్జున్‌ – సమంత ఫొటోలు కనిపించాయి. దీంతో ట్విటర్‌ దద్దరిల్లిపోయింది. బన్నీని సమంత ఏం ప్రశ్నలు అడుగుతుంది.. దానికి అతనేం సమాధానాలిస్తాడు అంటూ చర్చించుకుంటున్నారు.

ఇప్పుడు చర్చలోకి వచ్చిన మరో టాపిక్‌ చిరంజీవి. నిజానికి చిరంజీవి ఎపిసోడ్‌ షూటింగ్‌ చాలా రోజుల క్రితం అయిపోయింది. అయితే ఇంకా దానిని లైవ్‌లోకి తీసుకురాలేదు. ఎప్పుడు తెస్తారనే విషయంలో కొత్త సమాచారం బయటికొచ్చింది. కొత్త సంవత్సరం లేదా సంక్రాంతి స్పెషల్‌గా ఈ ఎపిసోడ్‌ లైవ్‌ అవుతుందని సమాచారం. ఇక రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు లాంటి వాళ్లు వస్తారా, వస్తే ఎప్పుడు అనేది కూడా మరో ప్రశ్న. తమన్నా ఈ సారి వచ్చింది.. కాబట్టి మిగిలిన హీరోయిన్లు రావడానికి పెద్ద సమయం పట్టదు. ఇదంతా చూస్తుంటే ‘ఆహా’ ఏం ప్లానింగ్‌ రా బాబూ అనిపిస్తోంది కదా.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus