ఈ 10 మంది టాలీవుడ్ స్టార్ కమెడియన్లు.. హీరోలుగా ఫెయిల్ అయ్యారుగా..!

  • February 26, 2024 / 11:27 AM IST

సినిమాల్లోకి చాలా మంది హీరోలు అవ్వడానికే వస్తారు. కానీ అందరికీ వెంటనే హీరో ఛాన్స్ దొరకాలి అంటే అంత సులభమైన విషయం కాదు. ముందుగా ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలో ఉండాలి. ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాక ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుని, మరోవైపు సర్కిల్ కూడా పెరిగితే.. ఆ తర్వాత ఏదైనా ఛాన్స్ ఉంటుంది. అంతేకానీ అందం ఉంది, డాన్స్..లు, ఫైట్లు చేసేస్తాను అంటూ హీరో అవ్వాలనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ప్రేక్షకులు ఓన్ చేసుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. మళ్ళీ ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ప్రేక్షకులు ఏ రకంగా ఓన్ చేసుకుంటారు..? కమెడియన్ గానా లేక హీరోగానా? అన్నది కూడా ముందుగానే అంచనా వేసుకోవాలి.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి, లేదా విలన్ నుండి హీరోలు అయ్యి నిలదొక్కుకున్నవాళ్ళు టాలీవుడ్లో ఉన్నారు. కానీ కమెడియన్లుగా రాణించి తర్వాత హీరోలుగా నిలబడ్డవాళ్లు ఎక్కువమంది లేరు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్లో హీరోలుగా నిలబడ్డ కమెడియన్స్ చాలా అంటే చాలా తక్కువ. ఎంత స్టార్ కమెడియన్స్ అయినా హీరోలుగా సినిమాలు చేసినప్పుడు కొంతమందికి నిరాశే ఎదురైంది. వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) కృష్ణ భగవాన్ :

తన నటనతో ఎలా ఉన్నా..బాడీ లాంగ్వేజ్ కి తగ్గ డైలాగులతో కితకితలు పెట్టే కృష్ణ భగవాన్ ‘జాన్ అప్పారావ్ 40+’ అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఇంకో సినిమాలో హీరోగా చేశాడు. అవి ఫ్లాప్ అయ్యాయి. హీరోగా నిలదొక్కుకోవాలి అనే ఇతని ఆశలు నెరవేరింది లేదు

2) అవసరాల శ్రీనివాస్ :

కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దర్శకుడిగా, హోస్ట్ గా, సెకండ్ హీరోగా… అవసరాల శ్రీనివాస్ అందరికీ సుపరిచితం. కానీ హీరోగా చేసిన ‘బాబు బాగా బిజీ’ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఇతను హీరోగా నిలబడలేకపోయాడు.

3) శ్రీనివాస్ రెడ్డి :

సీనియర్ నటుడు, స్టార్ కమెడియన్ అయిన శ్రీనివాస్ రెడ్డి హీరోగా ‘జయమ్ము నిశ్చయంబురా’ ‘ జంబ లకిడి పంబ’ వంటి సినిమాలు చేశాడు. అవి సక్సెస్ కాలేదు. దీంతో హీరోగా ఇంతకు నిలబడలేకపోయాడు.

4) సప్తగిరి :

‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ‘గూడుపుఠాణి’ ‘అన్స్టాపబుల్’ వంటి సినిమాలతో హీరోగా మారిన ఇతను సక్సెస్ కాలేకపోయాడు. కానీ కమెడియన్ గా మాత్రం సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాడు.

5) షకలక శంకర్ :

‘జబర్దస్త్’ కమెడియన్ గా పాపులర్ అయిన ఇతను ఆ తర్వాత సినిమాల్లో కూడా కమెడియన్ గా రాణించాడు . కానీ తర్వాత హీరోగా మారి ‘శంభో శంకర’ ‘నేనే కేడీ నెంబర్ 1’ వంటి సినిమాలు చేశాడు. తర్వాత కూడా హీరోగా ఇంకో రెండు సినిమాలు చేసినా అవి కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఇతని చేతిలో పెద్దగా ఛాన్సులు కూడా లేవు.

6) ధనరాజ్ :

పలు సినిమాల్లో నటించినా నటుడిగా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన ధనరాజ్.. ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులర్ అయ్యాడు.ఆ తర్వాత హీరోగా మారి ‘పనిలేని పులిరాజా’ అనే సినిమా చేశాడు. ఇది ఫ్లాప్ అయ్యింది. అయినా హీరోగా నిలబడాలి అని ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

7) రాహుల్ రామకృష్ణ :

కమెడియన్ అయినప్పటికీ దాదాపు సెకండ్ హీరో రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు రాహుల్ రామకృష్ణ. అయితే మెయిన్ హీరోగా ‘నెట్’ ‘ఇంటింటి రామాయణం’ వంటి పలు సినిమాలు చేసినా హీరోగా రాణించలేకపోతున్నాడు.

8) మహేష్ ఆచంట :

‘జబర్దస్త్’ కమెడియన్ గా పాపులర్ అయినా.. తర్వాత సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేస్తూ పాపులర్ అయ్యాడు ఇతను. తర్వాత ‘రంగస్థలం’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరోగా కూడా మారి ‘నేను నా నాగార్జున’ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. దీంతో మళ్ళీ హీరో ఛాన్సుల వైపు ఇతను దృష్టి పెట్టడం లేదు.

9) వైవా హర్ష :

యూట్యూబ్లో ‘వైవా’ తో క్రేజ్ సంపాదించుకున్న ఇతను ఆ తర్వాత కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యాడు. ఈ మధ్యనే ‘సుందరం మాస్టర్’ అనే సినిమాతో హీరోగా మారాడు. అది మెప్పించలేదు. ఇతన్ని కూడా జనాలు హీరోగా యాక్సెప్ట్ చేయలేదు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

10) అభినవ్ గోమఠం :

‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’ తో హీరోగా మారాడు స్టార్ కమెడియన్ (Comedians ) అభినవ్ గోమఠం. ఈ సినిమాకి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో హీరోగా ఇతన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం కష్టం అనే కామెంట్స్ మొదలయ్యాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus