మరో లేడీ డైరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడట..!

టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్లు కూడా ఎన్నో సినిమాల్ని రూపొందించి హిట్లు అందుకున్నారు. విజయ్ నిర్మల గారు అయితే ఏకంగా గిన్నీస్ బుక్ లో చేరి రికార్డు సృష్టించారు. ఆమె స్పూర్తి తో ఎంతో మందితో మహిళా దర్శకులు ఇండస్ట్రీలో తమ ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. దివంగత మహిళా దర్శకురాలు బి.జయ గారు ‘ప్రేమలో పావని కళ్యాణ్’ ‘చంటిగాడు’ ‘లవ్ లీ’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు.

తరువాత నందినీ రెడ్డి కూడా ‘అలా మొదలైంది’ ‘ఓ బేబీ’ వంటి హిట్ సినిమాలను అందించి ఫామ్లో ఉంది. ఇప్పుడు మరో లేడీ డైరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అట ఓ టాప్ డైరెక్టర్. ఆయన మరెవరో కాదు మన కొరటాల శివ. చాలా రోజులుగా కొరటాల నిర్మాతగా మారనున్నట్టు టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క డైరెక్టర్ గా వరుస విజయాల్ని అందుకుంటూనే మరోపక్క నిర్మాతగానూ రాణించాలి అని కొరటాల భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే పరశురామ్ -మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రానికి కొరటాల సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. మరోపక్క తన వద్ద పనిచేస్తూ వచ్చిన లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ ను కూడా దర్శకురాలిగా పరిచయం చెయ్యాలి అని భావిస్తున్నాడట. ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న కొరటాల … లాక్ డౌన్ పూర్తయ్యాక .. నిర్మాతగా కొత్త చిత్రాన్ని లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus