Tollywood Directors: హీరోలను మార్చుకోబోతున్న టాప్ డైరెక్టర్లు..!

టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లుగా ఎదిగిన బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇద్దరూ కూడా మాస్ సినిమాలు తీయడంలో దిట్ట. వీళ్ళ సినిమాలో కథేమీ కొత్తగా ఉండదు. కానీ సగటు మాస్ ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని అంశాలను తమ సినిమాల్లో పుష్కలంగా నింపుతారు ఈ దర్శకుడు. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ ఇద్దరూ డైరెక్టర్లుగా మారింది రవితేజ సినిమాలతోనే..! రవితేజ హీరోగా నటించిన ‘భద్ర’ తో బోయపాటి, ‘డాన్ శీను’ తో గోపీచంద్ మలినేని డైరెక్టర్లుగా పరిచయం అయ్యారు.

ఇదిలా ఉండగా.. త్వరలో ఈ దర్శకులు హీరోలను ఎక్స్చేంజ్ చేసుకోబోతున్నారట. అదెలా అంటారా.. గోపీచంద్ మలినేని ఈ ఏడాది ఆరంభంలో ‘క్రాక్’ తో హిట్టు కొట్టి.. రవితేజతో హ్యాట్రిక్ ను కంప్లీట్ చేసాడు.అలాగే తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో చేయబోతున్నట్టు అనౌన్స్ చేసాడు. ఇక బోయపాటి శ్రీను.. ప్రస్తుతం బాలకృష్ణతో ‘అఖండ’ మూవీ చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్లు వచ్చాయి కాబట్టి.. ఈ మూవీ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ‘అఖండ’ కు సంబంధించి విడుదల చేసిన టైటిల్ రోర్ ..

యూట్యూబ్లో 54 మిలియన్లకు పైగా వ్యూస్ ను నమోదు చేయడంతో ఆ విషయం ప్రూవ్ అయ్యింది. ఇక ఈ చిత్రం పూర్తయ్యాక బోయపాటి.. బన్నీతో సినిమా చేయాలనుకున్నాడు. కానీ బన్నీ ప్రస్తుతం ఖాళీ లేకపోవడంతో రవితేజతో సినిమా చేసే అవకాశం ఉందట. అయితే రవితేజ కూడా ఇప్పుడు 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మరి బోయపాటి ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నది పెద్ద ప్రశ్న. చూడాలి మరి ఫైనల్ గా ఏమవుతుందో..!

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus