Vasu Movie: వాసు సినిమాని ఆ హీరో చేసి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది!

కొన్ని సినిమాలు చూసేందుకు చాలా బాగుంటాయి,కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కావు. పాటలు ,కామెడీ మరియు రొమాన్స్ ఇలా అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినవి ఉన్నవి. అసలు ఇవి ఫ్లాప్ సినిమాలు అని మనకి తెలియవు, టీవీ లో చూసినప్పుడు రిపీట్ గా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము,కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కలెక్షన్స్, ట్రేడ్ , ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ , ఆడియో రైట్స్ వగైరా ఇవన్నీ తెలుస్తుంటాయి.

అలా మనకి చిన్నతనం లో ఎంతో నచ్చిన ఒకటి విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘వాసు’ అనే చిత్రం. ఈ సినిమాని మన చిన్నతనం లో చాలా ఇష్టపడి ఉంటాము, ఇందులోని పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.కామెడీ , సెంటిమెంట్ , ఎమోషన్స్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి, కానీ కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఎందుకంటే ఆరోజుల్లో ఇలాంటి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఈ సినిమా చూస్తున్నంత సేపు పవన్ కళ్యాణ్ మాత్రమే మనకి గుర్తుకు వస్తాడు. ఆ రేంజ్ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసాడు ఆయన. అయితే ఈ సినిమాని తొలుత పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నది ఆ చిత్ర డైరెక్టర్ కరుణాకరన్. కానీ పవన్ కళ్యాణ్ స్టోరీ విన్న తర్వాత ఇలాంటి సినిమానే చేసాము కదా రీసెంట్ గానే, మళ్ళీ అలాంటి చిత్రమే చేస్తే జనాలు తీసుకోలేరు, వదిలేయండి అని చెప్పాడట.

అయితే ఇదే స్టోరీ ని వెంకటేష్ కి చెప్పడం తో ఆయన వెంటనే ఓకే చెప్పి చిత్రం ఒప్పుకున్నాడు. కానీ జనాలు ఎందుకో ఈ కథ కి వెంకటేష్ సూట్ కాలేదు అనుకున్నారో ఏమో తెలియదు కానీ కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఒప్పుకొని చేసుంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus