‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ మూవీ గురించి మనకు తెలియని నిజాలు.. !

నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణూ శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఎం.సి.ఎ'(మిడిల్ క్లాస్ అబ్బాయి). సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం 2017 డిసెంబర్ 21న విడుదలయ్యింది.అప్పటి స్టార్ హీరోయిన్ భూమిక ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మొదటి రోజు ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ.. అప్పటికి నాని సూపర్ ఫామ్లో ఉండడంతో ఈ చిత్రం ఫైనల్ గా సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది.

ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.40కోట్ల షేర్ ను వసూల్ చేసి.. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దర్శకుడు వేణు శ్రీరామ్ కు కూడా పవన్ కళ్యాణ్ తో పనిచేసే అవకాశాన్ని కలిపించింది ఈ చిత్రం. అయితే ‘ఎం.సి.ఎ’ చిత్రానికి హీరోగా ఫస్ట్ ఛాయిస్ నాని కాదట. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే నాని లైన్లోకి వచ్చాడట. ఆ స్టార్ హీరో ఎవరా అని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు మన మాస్ మహారాజ్ రవితేజ. ముందుగా ఈ కథని దర్శకుడు రవితేజకు వినిపించాడట.

ఆయన కూడా ఈ ప్రాజెక్టు చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. కానీ తరువాత స్క్రిప్ట్ లో తన ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చెయ్యమని.. రవితేజ దర్శకుడు వేణు శ్రీరామ్ ను కోరాడట. అందుకు ‘అలా మార్చేకంటే మీడియం రేంజ్ హీరోతో ఈ సినిమా చేస్తే బెటర్’ అని నిర్మాత దిల్ రాజు భావించి రవితేజతో ‘రాజా ది గ్రేట్’ చేయించినట్టు ఇన్సైడ్ టాక్. ఏమైనా రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus