Sarpatta movie: అబ్బా.. ఆ సినిమా వల్ల ఈ హిట్టు సినిమాని వదులుకున్నాడట..!

సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కబాలి’ ‘కాలా’ వంటి రెండు విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పా.రంజిత్… ఆర్యతో ‘సార్పట్ట’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది బాక్సింగ్ నేపథ్యంలో సాగే మూవీ. ‘కబాలి’, ‘కాలా’ లానే ఈ మూవీలో కూడా వెనుకబడిన తరగతుల నేపథ్యంలో సాగే మూవీనే. కానీ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. బాక్సింగ్ పోరాట సన్నివేశాలు కూడా నేచురల్ గా సాగుతాయి. గత ఏడాది అంటే 2021 వ సంవత్సరం జూలై 22న ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా నేరుగా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో రిలీజ్ అయ్యింది.

Click Here To Watch NOW

ఎటువంటి అంచనాలు లేకుండా ఇంకా చెప్పాలంటే చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ జనాలకు ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో చెప్పడానికి.. ఈ మూవీ పై సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ నిదర్శనం. ‘ఆర్య’ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. అతని బాడీని ఈ మూవీ కోసం ఎన్ని రకాలుగా నలపాలో అన్ని రకాలుగా నలిపేసాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ఓ టాలీవుడ్ హీరో రిజెక్ట్ చేసాడట. అయితే ఆ హీరో రిజెక్ట్ చేసింది ఈ మూవీలో విలన్ రోల్ ను మాత్రమే.

‘సార్పట్ట’ లో విలన్ గా నటించింది జాన్ కొక్కెన్. ఇతను ‘బిగ్ బాస్2’ బ్యూటీ మరియు ప్రముఖ నటి అయిన పూజా రామచంద్రన్ భర్త. గతంలో ఇతను ‘బాహుబలి ది బిగినింగ్’ లో కూడా నటించాడు. ఆ మూవీతో పాటు ఇంకా చాలా సినిమాల్లో నటించాడు. కానీ ‘సార్పట్ట’ లో చేసిన వేటపులి పాత్ర ఇతనికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అయితే ఈ పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఇతను కాదు.

మన టాలీవుడ్ హీరో మరియు విలక్షణ నటుడు అయిన నవీన్ చంద్ర. వేటపులి పాత్రకి మొదట ఇతన్నే అడిగారట. కానీ ‘గని’ చిత్రం కోసం ఆ పాత్రని వదులుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ‘సార్పట్ట’ చూసాక ఇంత మంచి పాత్రని వదులుకున్నందుకు డిజప్పాయింట్ అయ్యాడట.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus