Prabhas: ప్రభాస్ కు ఈ హీరోలతో పోటీ తప్పదా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రస్తుతం 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే ఆ హీరో ప్రభాస్ మాత్రమే అని చెప్పాలి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుండగా ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజైన తర్వాత చరణ్, తారక్ పారితోషికాన్ని భారీగా పెంచాలని భావిస్తున్నారు. టాలీవుడ్ హీరోలలో ఎక్కువమంది హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రభాస్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవాలని భావిస్తున్నారు. కేజీఎఫ్, బాహుబలి తరహా హిట్ సాధిస్తే టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్లు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నారు. రిస్క్ తీసుకోవడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు అస్సలు ఆసక్తి చూపడం లేదు. లైగర్ సినిమాకు విజయ్ దేవరకొండ 30కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని భోగట్టా.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే విజయ్ రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ స్థాయిలో కాకపోయినా భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే రెమ్యునరేషన్ ను పెంచాలని మిడిల్ రేంజ్ హీరోలు భావిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఎంతమంది టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సంపాదించుకుని 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus