మా వల్ల కాదంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలు..!

ఇప్పటికే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఎన్నో సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. థియేటర్లను మూసేసారు కాబట్టి.. విడుదల కావాల్సిన చాలా సినిమాలు కూడా ఆగిపోయాయి. రెండు నెలల సుదీర్ఘ లాక్ డౌన్ తరువాత ప్రభుత్వం నుండీ కొన్ని సంస్థలకు సడలింపులు లభిస్తున్న తరుణంలో.. మన టాలీవుడ్ పెద్దలు కూడా షూటింగ్స్ ప్రారంభించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రముఖ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో మీటింగ్లు మీద మీటింగ్లు నిర్వహించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను కలిశారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిశారు. చిరంజీవి హయాంలో ఈ ప్రయత్నాలు జరిగాయి.మొత్తానికి షూటింగ్లకు పర్మిషన్లు సంపాదించారు. అయితే ‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు’ అని మన పెద్ద వాళ్ళు చెప్పినట్టు, అంత కష్టపడి సినిమా షూటింగ్ లకు పెర్మిషన్లు తెచ్చుకున్న దర్శక నిర్మాతలను.. హీరోలు మాత్రం కరుణించట్లేదు. రాంచరణ్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. వంటి హీరోలు .. ఇప్పట్లో షూటింగ్లలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా లేనట్టు సమాచారం.

రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ టీం కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడిందట. లాక్ డౌన్ ను చాలా వరకూ ఎత్తివేసే టైములో ఇప్పుడు భయంకరంగా వైరస్ మహమ్మారి వల్ల కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణాలో .. అందులోనూ జి.హెచ్.ఎం.సి పరిథిలోనే రోజుకి వందకు పైనే కేసులు నమోదవుతున్నాయి. దాంతో ఇప్పుడు స్టార్ హీరోలు కూడా భయపడుతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus