కళాకారులకు డబ్బు ముఖ్యం కాదు.. తన కళకు గుర్తింపు, అభినందనలు కోరుకుంటారు. తరువాతే డబ్బు. అందుకే కళాకారులకు బిజినెస్ కి పొంతన కుదరదు. ఇందుకు భిన్నంగా మన టాలీవుడ్ లోని స్టార్స్ బిజినెస్ లో రాణిస్తున్నారు. ఎంట్రప్రెన్యూర్స్ గా దూసుకుపోతున్నారు. అటువంటి వారిపై ఫోకస్…
నాగార్జునకింగ్ నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుకు వారసుడిగా నిరూపించుకున్నారు. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. నిర్మాతగా సినిమాలను నిర్మిస్తూ, మరో వైపు వ్యాపారాల్లో లాభాలను గడిస్తున్నారు. ఎన్ – గ్రిల్ రెస్టారెంట్, ఎన్ – కన్వెన్షన్ సెంటర్ లను నడిపించడమే కాదు… కేరళ బ్లాస్టర్స్ జట్టుకి కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు.
చిరంజీవిమెగాస్టార్ చిరంజీవిది సున్నిత మనస్తత్వం అందుకే వ్యాపారం జోలికి రాలేదు. రీసెంట్ గా నాగార్జున తో కలిసి కేరళ బ్లాస్టర్స్ జట్టుకి కో ఓనర్ గా పెట్టుబడులు పెట్టారు. గతంలోనూ మాటీవీలో భాగస్వామిగా కొనసాగారు.
మోహన్ బాబుకలక్షన్ కింగ్ మోహన్ బాబు నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగా సక్సస్ అయ్యారు. లక్ష్మి ప్రసన్న పిశ్చర్స్ బ్యానర్లో అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించారు. అంతేకాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు.
జగపతి బాబుప్రముఖ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జగపతిబాబు ఆలస్యంగా ట్యాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని మొదలుపెట్టారు. క్లిక్ సినీ కార్ట్ పేరుతో వెబ్ పోర్టల్ ని మొదలెట్టారు. సినీ రంగానికి, ఔత్సాహికులకు సంధాన కర్తగా వ్యవహరిస్తున్నారు.
రామ్ చరణ్ తేజ్మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ చిన్న వయసులోనే బిజినెస్ లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ కి ఓనర్ అయ్యారు. టర్బో మేఘ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ని స్థాపించి ద్విగిజయంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాతగానూ మారి ఖైదీ నంబర్ 150 మూవీతో తొలి సక్సస్ ని అందుకున్నారు.
రానాదగ్గుబాటి రానా సినిమాలో రాక పూర్వం వీఎఫ్ఎక్స్ కంపెనీకి ఓనర్ గా ఉన్నారు. నటుడిగా మారిన తర్వాత కూడా “కా కాన్” అనే ట్యాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ముంబయి లో ఉన్న ఈ కంపెనీ ఫిలిం మేకర్స్ కి కొత్త నటీనటులు, టెక్నీషియన్లను పరిచయం చేస్తోంది.
నవదీప్యువ హీరో నవదీప్ బెస్ట్ ఎంట్రప్రెన్యూర్స్ గా నిరూపించుకున్నారు. రా ప్రొడక్షన్ హౌస్ పేరుతో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ని స్థాపించి సక్సస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు.
అల్లు అర్జున్స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక అంతర్జాతీయ కంపెనీతో కలిసి 800 జూబ్లీ అనే పెద్ద రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఇందులో క్లబ్, ఈవెంట్స్ చేసుకునేందుకు హాల్ అన్నీ ఉంటాయి. యువ సెలబ్రిటీలు ఎంజాయ్ చేయడానికి ఇది మంచి కేంద్రమైంది.
శర్వానంద్యువ హీరో శర్వానంద్ తన అభిరుచి మేరకు బీన్జ్ అనే కాఫీ షాప్ మొదలుపెట్టారు. ద అర్బన్ కాఫీ విలేజ్ అనే ట్యాగ్ లైన్ ఉన్న ఈ షాప్ లో వివిధ దేశాలలో ప్రాచుర్యం పొందిన కాఫీలు లభిస్తాయి.
మంచు విష్ణుమంచు విష్ణు భార్య వెరోనికాతో కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో న్యూ యార్క్ అకాడమీ అనే విద్యా సంస్థను ప్రారంభించారు. అంతేకాకుండా అనేక కంపెనీల్లో వాటాదారుడిగా ఉన్నారు.
కమల్ కామరాజుకమల్ కామరాజుకి నటనతో పాటు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఇంటిదగ్గర మూడు వచ్చినప్పుడల్లా కుంచె పట్టుకొని అందమైన చిత్రాలు గీస్తుంటారు. ఈ అభిరుచిని వ్యాపారంగా మార్చుకున్నారు. ఇంటివద్ద కమల్ రాజు ఆర్ట్ అనే పేరుతో గ్యాలరీ ఏర్పాటు చేసి ఫైటింగ్ ని విక్రయిస్తున్నారు.
శశాంక్సై చిత్రం ద్వారా గుర్తింపు పొందిన శశాంక్ అలనాటి క్లాసిక్ మూవీ మాయాబజార్ పేరుతో రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఇందులో తెలుగువారికి ఇష్టమైన వంటకాలను అందిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు.
సచిన్ జోషినటుడు, క్రీడాకారుడు సచిన్ జోషి పెద్ద బిజినెస్ మ్యాన్ తనయుడు. తండ్రి జేఎంజే గ్రూప్ కంపెనీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే నిర్మాతగా కొన్ని చిత్రాలు తీశారు. అలాగే తెలుగు వారియర్స్ సినీ సెలబ్రిటీస్ క్రికెట్ జట్టుకి యజమానిగా కొనసాగుతున్నారు.