తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పడిన కొత్తలో నాటకాల్లో అనుభవం కలిగిన వారిని తమ సినిమాల్లో తీసుకునే వారు. ఇప్పుడు బుల్లి తెరలో ఎక్కువమంది అభిమానులను గెలుచుకున్న వారిని సినిమాల్లోకి ఆహ్వానిస్తున్నారు. టీవీ కార్యక్రమాల్లో అదరగొట్టిన వీరు సినిమాల్లోనూ చక్కని నటనతో ఆకట్టుకుంటున్నారు. ఆర్టిస్టులు మాత్రమే కాకుండా టెక్నీషియన్లు వెండి తెర వెనుక కీలక పాత్ర పోషిస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. అటువంటి కొంతమందిపై ఫోకస్ ..
ఎస్.ఎస్.రాజమౌళిబాహుబలి సినిమాతో తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి చాటిన ఎస్.ఎస్.రాజమౌళి .. స్టూడెంట్ నంబర్ వన్ సినిమాని తెరకెక్కించక ముందు ఈటీవీలో శాంతి నివాసం సీరియల్ తీశారు. బుల్లి తెరపైన మొదలెట్టిన విజయాన్ని ఇప్పటివరకూ కొనసాగిస్తున్నారు.
వక్కంతం వంశీకిక్, రేసుగుర్రం వంటి చిత్రాలతో రైటర్ గా పేరుతెచ్చుకున్న వక్కంతం వంశీ చిన్నప్పుడే భాగవతం అనే టీవీ సీరియల్ ల్లో నటించారు. అంతే కాదు న్యూస్ రీడర్ గా, షో హోస్ట్ గా వ్యవహరించారు. అనంతరం సినిమాల్లో హీరోగా అవతారమెత్తి అటు విజయం సాధించక పోవడంతో .. రైటర్ గా మారి.. ఇప్పుడు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టనున్నారు.
కలర్స్ స్వాతిమా టీవీ లో కలర్స్ అనే షో కి యాంకర్ గా వ్యవహరించిన స్వాతి ఇంటి పేరు కలర్స్ గా మారిపోయింది. అంతలా పేరు తెచ్చుకున్న ఆమె.. సినిమాల్లో హీరోయిన్ గా నటించి అందరితో అభినందనలు అందుకుంది. కోలీవుడ్ లోను అనేక సినిమాలు చేసింది.
అనసూయమాటీవీలో స్టార్స్ ని ఇంటర్వ్యూ చేసిన అనసూయ జబర్దస్త్ తో బాగా పాపులర్ అయింది. ఆ పాపులర్ సినిమాల్లో అవకాశాలను తెచ్చి పెట్టింది. ప్రత్యేక పాటల్లో డ్యాన్సులు చేస్తూనే క్షణం వంటి సినిమాలో కీలక రోల్స్ పట్టేసి దూసుకుపోతోంది.
మంచు లక్ష్మిడైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె కి నేరుగా సినిమాల్లోకి వచ్చేందుకు వీలు ఉంది. కానీ ఆమె విదేశీ ఛానల్లో ఇంగ్లిష్ సీరియల్స్ లో నటించి అభినందనలు అందుకున్న తర్వాత తెలుగు ఛానల్లోనూ పలు షోస్ చేసింది. అనంతరం సినిమాల్లో హీరోయిన్ గా అదరగొడుతోంది.
ప్రదీప్మేల్ యాంకర్ అయినప్పటికీ ఫీమేల్ యాంకర్స్ అందరినీ పక్కన పెట్టి వివిధ ఛానల్స్ లో అనేక షోస్ చేస్తున్న ప్రదీప్ కి వెండి తెర స్వాగతం పలికింది. ప్రదీప్, జల్సా, అత్తారింటికి దారేది తదితర చిత్రాల్లో నటించారు.
వాసు ఇంటూరిఅమృతం సీరియల్ ల్లో పనివాడుగా సగం తమిళం, సగం తెలుగు మాట్లాడుతూ ఆకట్టుకుంటున్న నటుడు వాసు ఇంటూరి. అతనికి కూడా సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.
హర్షవర్ధన్అమృతం ద్వారా పాపులర్ అయినా మరో నటుడు హర్షవర్ధన్. ఐతే మూవీ ద్వారా గుర్తింపు తెచ్చుకొని వెనక్కి తిరిగి చూసుకోలేదు. మనం, గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలకు స్క్రీన్ ప్లే, డైలాగులు రాసి తెరవెనుక కూడా బిజీగా ఉన్నారు.
సాయి పల్లవిమలయాళ అమ్మాయి సాయి పల్లవి చిన్నప్పటి నుంచి పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈటీవీ లో ఢీ షోలో పార్టిసిపెంట్ గా డ్యాన్స్ తో అలరించింది. ఆమెకి మలయాళ పరిశ్రమ ప్రేమమ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసింది, ఈ ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులోని ఫిదా మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.
నిహారిక కొణిదెలమెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెలకు వెండి తెరపై ఎంట్రీ ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఆమె తనకి అనుభవం కోసం బుల్లి తెరపై యాంకర్ గా నిరూపించుకొని ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా వెండి తెరపై మెరిసింది.