హీరో అంటే .. సమస్యలపై స్పందించాలి. పరిష్కారానికి పోరాడాలి. అడ్డు తగిలిన వారిని చిత్తు చేయాలి. అందుకే కథానాయకులకు కొత్త కోపం.. మరికొంత దూకుడు ఉంటుంది. అటువంటి వ్యక్తికి చిరాకు తెప్పిస్తే రచ్చ వేరేలా ఉంటుంది. సినిమాలో హైపర్ యాక్టివ్ గా ఉండే పాత్రలు చేసిన మన స్టార్ హీరోస్ పై ఫోకస్…
లెజెండ్మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నందమూరి నటసింహ బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ తప్పనిసరి. అదిరిపోయే డైలాగులు సర్వ సాధారణం. అయితే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమాలో బాలయ్య నటన పీక్స్ లో ఉంటుంది.
ఇంద్రఅన్నిరకాల కథలను ఎంచుకుంటూ.. ఆ పాత్రలో ఒగిగిపోయి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి సినీ కెరీర్ లో ఇంద్రకి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో అంతకముందు ఏ సినిమాలో చిరు కనిపించనంత హైపర్ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా పెళ్లి మండపంలో జరిగే యాక్షన్ సీన్ లో మెగాస్టార్ పరిధులను దాటి నటించారు.
కొమురం పులికాలేజీ కుర్రోడి పాత్రల్లో నటిస్తూ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరావేశంతో నటించిన సినిమా కొమురం పులి. ఇందులో పవన్ నటన చూస్తుంటే నిజంగానే పాత్రలో లీనైపోయినట్లు కనిపిస్తారు. ఆ డైలాగులు కూడా అలాగే ఉంటాయి.
పోలీస్ స్టోరీఆవేశపూరిత పాత్రలు చేస్తూ.. గంభీరమైన గొంతుతో గడగడలాడించే సాయి కుమార్ పోలీస్ స్టోరీ చిత్రంలో కంట్రోల్ చేయలేని పోలీస్ పాత్రలో హైపర్ యాక్టివ్ గా కనిపించారు. ఆయన కెరీర్ నే ఈ చిత్రం మలుపుతిప్పింది.
దూకుడు“ఈ దూకుడు లేకపోతే పోలీస్ మ్యాన్ కి పోస్ట్ మ్యాన్ కి తేడా ఉండదు” ..దూకుడు చిత్రంలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ మాదిరిగానే క్యారక్టర్రైజేషన్ ఉంటుంది. ఇందులో ప్రిన్స్ కరుడుగట్టిన మాఫియా డాన్ తోనైనా, ప్రియురాలితో అయిన హైపర్ యాక్టివ్ గా ఉంటారు.
నరసింహుడుయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆది చిత్రంలోనే యాక్టివ్ గా కనిపించి అదరగొట్టారు. కంట్రోల్ చేసుకోలేని ఆవేశంలో నటించిన సినిమాల్లో నరసింహుడు తొలి స్థానంలో నిలిచింది. ఇందులో విశ్రాంతి వరకు ఎంత కూల్ గా ఉంటారో .. విశ్రాంతి తర్వాత ఎన్నోరెట్లు హైపర్ యాక్టివ్ గా ఎన్టీఆర్ కనిపించారు.
రాఘవేంద్రరెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో హైపర్ యాక్టివ్ గా ఉండే పాత్రను రాఘవేంద్ర సినిమాలో చేశారు. ఎక్కువ యాక్షన్ సీన్స్ లో కంట్రోల్ చేసుకోలేని కోపంతో విలన్స్ ని తరితమిరి కొడుతాడు. దీనిపై ఒక పాటు కూడా ఉంటుంది.
రక్షకుడుటాలీవుడ్ మన్మథుడిగా పేరుగాంచిన కింగ్ నాగార్జున అన్ని రకాల కథల్లో నటించారు. అయితే రక్షకుడు చిత్రంలో ఆయన చేసిన క్యారెక్టర్ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వారిని కొట్టే పాత్రలో నాగ్ కనిపించారు.
దరువుమాస్ మహారాజ రవితేజ చాలా యాక్టివ్ గా ఉంటారు. అటువంటి పాత్రల్లో నటించేందుకు ఇష్టపడుతుంటారు. దరువులో ఆయన పోషించిన క్యారక్టర్ సినిమా మొదటి నుంచి చివరి వరకు హైపర్ యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించింది.
రేయ్మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హైపర్ యాక్టివ్ పాత్ర ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రేయ్ మూవీలో తేజు రెచ్చిపోయి నటించారు.