రెండో పెళ్లిపై మనసు పడ్డ తారలు

పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని అంటుంటారు పెద్దలు. అలా ఓ బ్రహ్మ ముహూర్తాన భూమిపై ఓ అబ్బాయి, ఓ అమ్మాయి దంపతులుగా ఒకటవుతారు. మాంగళ్య బంధం వారిని కలకాలం కలిపి ఉంచుతుంది. కానీ కొన్ని జంటలను విధి విడదీస్తుంది. మరికొన్ని జంటలు మనసులు కలవక విడిపోతుంటారు. నచ్చిన వ్యక్తితో నడవడానికి సిద్ధమవుతారు. ఇలాంటి సంఘటనలు సామాన్యుల ఇళ్లల్లోనే కాదు సెలబ్రిటీల జీవితాల్లోను జరుగుతుంటాయి. టాలీవుడ్ లో మళ్లీ పెళ్లిళ్లు చేసుకున్న కొంతమంది స్టార్స్ గురించి ఫోకస్.

ఎన్టీఆర్మహానటుడు, రాజకీయ నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు, బసవతారకంలు అన్యోన్య దంపతులు. వీరికి 12 మంది సంతానం. అనారోగ్య కారణాల వల్ల బసవ తారకం మరణించారు. వృధ్యాప్యంలో ఒంటరి అయినా ఎన్టీఆర్ తన తోడుకోసం లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకున్నారు.

కృష్ణసూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో రాకముందే ఇందిరను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఐదు మంది సంతానం. కృష్ణ తన సహా నటి విజయ నిర్మలను ప్రేమించారు. దాంతో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి విజయ నిర్మలను మనువాడారు.

కృష్ణం రాజుయంగ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు తొలి సతీమణి పేరు సీతాదేవి. వీరికి ఒక పాప పుట్టింది. ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి సంసారంపై విధి ఆగ్రహించింది. సీతాదేవి కారు ప్రమాదంలో చనిపోయింది. ఆ తర్వాత శ్యామల దేవిని కృష్ణం రాజు పెళ్లి చేసుకున్నారు. రెండో భార్యతో కలిసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు.

మోహన్ బాబుడైలాగ్ కింగ్ మోహన్ బాబు మొదట విద్యాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారీ దంపతులు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తో విద్యాదేవి మరణించింది. ఆ తర్వాత విద్యాదేవికి చెల్లెలు అయిన నిర్మలా దేవిని మోహన్ బాబు వివాహమాడారు.

కమల హాసన్విశ్వనటుడు కమల్ హాసన్ మొదట డ్యాన్సర్ అయిన వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ పది సంవత్సరాలు కలిసి సంతోషంగా గడిపారు. బాబు కూడా పుట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. తర్వాత తనతో నటించిన హీరోయిన్ సారికను కమల్ రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి శృతి హాసన్, అక్షర హాసన్ పిల్లలు కలిగారు. రెండో భార్యను కు కూడా విడాకులు ఇచ్చి నటి గౌతమితో సహజీవనం చేశారు. తాజాగా వీరిద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు.

నాగార్జునకింగ్ అక్కినేని నాగార్జున మొదట ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుమార్తె లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నాగ చైతన్య పుట్టాడు. కొంతకాలానికి కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. అనంతరం సహ నటి అమలతో జీవితాంతం నడుస్తానని నాగ్ ఏడు అడుగులు వేశారు. వీరిద్దరి ప్రేమకు ప్రతి రూపమే అఖిల్.

పవన్ కళ్యాణ్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదట నందినిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి బద్రి హీరోయిన్ రేణు దేశాయ్ తో కొంతకాలం సహజీవనం చేసి, తర్వాత తాళికట్టి అర్ధాంగిని చేసుకున్నారు. వీరికి అకీరా, ఆద్య అని ఇద్దరు పిల్లలు. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ప్రస్తుతం విదేశీ నటి అన్నా లెజినోవాతో పవన్ సహజీవనం చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మొదటి భార్య పేరు లలిత కుమారి. వారికి ఇద్దరు అమ్మాయిలు. కొన్ని మనస్పర్థలు కారణంగా వీరిద్దరూ విడిపోయారు. తర్వాత ప్రకాష్ రాజ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ని పెళ్లాడారు. ప్రస్తుతం వీరికో పాప.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus