మీసం మెలేసి మెప్పించిన టాలీవుడ్ స్టార్స్

మీసం మగాడి ఆభరణం. మెలేసిన మీసం మొనగాడి చిహ్నం. తమ హీరో మొనగాడిగా ఉండాలని తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు కోరుకుంటుంటారు. అందుకే అటువంటి కథలు తమ వద్దకు వస్తే ఏ హీరో వదులుకోరు. అప్పట్లో మీసం తిప్పి ఎన్టీఆర్, కృష్ణ లు హిట్స్ సాధించారు.ఆ తర్వాత కూడా హిట్ ఆనవాయితీ కొనసాగింది. అలా మీసం మెలేసి మెప్పించిన నేటి టాలీవుడ్ స్టార్స్ పై ఫోకస్..

బాలకృష్ణ ఎక్కువగా పౌరుషానికి ప్రతీకగా ఉండే పాత్రల్లో నటించడం బాలయ్య నైజం. సమరసింహా రెడ్డి, సింహా, లెజెండ్, రీసెంట్ గా వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో మీసం మెలేసి విజయాన్ని బాలకృష్ణ తన ఖాతాల్లో వేసుకున్నారు.

చిరంజీవి మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకమైన మీసకట్టుకుంటుంది. ఇంద్ర కోసం మీసం మెలేసి రాయలసీమ మొనగాడిగా నటించి హిట్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా మీసం తిప్పనున్నారు.

వెంకటేష్ సాఫ్ట్ క్యారెక్టర్స్ తో మహిళల్లో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ జయం మనదేరా సినిమా కోసం మీసం మెలేసారు. జయం అందుకున్నారు.

నాగార్జున కింగ్ నాగార్జున అన్ని రకాల పాత్రలు పోషిస్తుంటారు. ఎదురులేని మనిషి చిత్రంలో కోరమీసంతో కనిపించారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కోరమీసంతో ఆకట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కోరమీసం అచ్చి రాలేదు. కొమురం పులి కోసం మీసం మెలి వేశారు పవన్. ఆ మూవీ విజయం సాధించలేదు. కాటమరాయుడులోను కోరమీసంతో కనిపించారు. ఇది యావరేజ్ గా ఆడింది.

రవితేజ మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్న రవితేజ ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఆ ఎనర్జీకి మెలేసిన మీసం మరింత పవర్ ని ఇచ్చింది. విక్రమార్కుడు చిత్రంలో రవితేజ విక్రమ్ సింగ్ రాథోడ్ గా అదరగొట్టారు.

రామ్ చరణ్ మగధీర సినిమాలో కాలభైరవుడి పాత్రకోసం రామ్ చరణ్ మీసం మెలేసారు. బ్లాక్ బస్టర్ ని వెనకేసుకున్నారు.

ప్రభాస్
భారీ కటౌట్ కలిగిన ప్రభాస్ మీసం మెలేస్తే ఎలా ఉంటుందో బాహుబలి చిత్రంలో రాజమౌళి చూపించారు. అమరేంద్ర బాహుబలి లుక్ కి మీసం ప్రత్యేక ఆకర్షణ.

అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యువతను ఆకట్టుకునే లుక్ లో కనిపిస్తుంటాడు. తొలిసారి సరైనోడు కోసం మీసం మెలేసాడు. ఆ లుక్ బన్నీ కి ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చింది.

ఎన్టీఆర్ అప్పుడు తాత నందమూరి తారకరామారావు, ఇప్పుడు బాబాయ్ బాలకృష్ణ మీసం తిప్పి అదరగొట్టారు. ఎన్టీఆర్ కూడా దమ్ము సినిమాలో మీసం మెలేసి అలరించారు. తాజాగా జై లవకుశ కోసం కోరమీసం పెట్టాడు. రీసెంట్ గా వదిలిన ఈ మూవీ ఫస్ట్ నందమూరి అభిమానులందరికీ తెగ నచ్చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus