మన టాలీవుడ్ సినిమాలు సౌత్ భాషలన్ని సినిమాలకి పోటీ ఇస్తున్నాయి. మన తెలుగు సినిమాల్ని బాలీవుడ్ వాళ్ళు కూడా ఏరికోరి రీమేక్ రైట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇక మన సినిమాలు ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతున్నాయి. అక్కడ కలెక్షన్స్ తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు 25 శాతం సేఫ్ అయిపోతున్నారు. ప్రేమియర్స్ తోనే మన సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక వేళ టాక్ బాగుంటే మొదటి రోజు మిలియన్ డాలర్ మార్కును దాటేస్తున్నాయి మన తెలుగు సినిమాలు.
ఓవర్సీస్ లో తిరుగులేని రారాజుగా మహేష్ బాబు అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. అతని డిజాస్టర్ సినిమాలు కూడా 1 మిలియన్ మార్కు ను దాటేస్తుండడం విశేషం. అయితే ఓపెనింగ్స్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ముందుంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలకు కూడా అక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక డైరెక్టర్స్ లో రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ వంటి డైరెక్టర్ల సినిమాలకి అక్కడ పిచ్చ క్రేజ్ ఉంది. అయితే ఇప్పటి వరకూ టాప్ 10 ప్రీమియర్స్ ను సాధించిన సినిమాలను ఓ లుక్కేద్దాం రండి.
1) బాహుబలి 2 : $ 2.45 మిలియన్
2) అజ్ఞాతవాసి : $1.52 మిలియన్
3) బాహుబలి ది బిగినింగ్ : $1.36 మిలియన్
4) ఖైదీ నెంబర్ 150 : $1.29 మిలియన్
5) స్పైడర్ : 1.003 మిలియన్
6) సాహో : $915 K
7) భరత్ అనే నేను : $850 K
8) అరవింద సమేత : $798 K
9) రంగస్థలం : $725 K
10) సర్దార్ గబ్బర్ సింగ్ : $616 K