ఇప్పుడు సౌత్ సినిమా అంటే ఇండియన్ సినిమా అనేంత స్థాయికి వెళ్లింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధిస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే రూ.70 కోట్ల లోపే థియేట్రికల్ బిజినెస్ చేసేది. అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఆ స్థాయిలోనే బిజినెస్ చేసేది. కానీ ‘బాహుబలి’ పుణ్యమా అని రూ.100 కోట్లకి పైగా బిజినెస్ చేస్తున్నాయి మన సినిమాలు. ‘బాహుబలి’ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ ‘పుష్ప’ వంటి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచాయి. పాండమిక్ టైంలో కూడా మన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చూపించిన జోరు అంతా ఇంతా కాదు.
తెలుగులో ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. ఆ సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేస్తున్నాయి.అల్లు అర్జున్ ‘పుష్ప2’, ప్రభాస్ ‘సలార్’, విజయ్ దేవరకొండ ‘లైగర్’, రాంచరణ్- శంకర్ ల ‘ఆర్.సి15’ వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. ఇవి షూటింగ్ దశలో ఉండగానే భారీ లెవెల్లో థియేట్రికల్ బిజినెస్ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఇప్పటివరకు టాలీవుడ్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ఆర్.ఆర్.ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఈ మూవీకి ఏకంగా రూ.492 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఇది పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.
2) బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీకి ఏకంగా రూ.350 కోట్లు (అన్ని వెర్షన్లు కలుపుకుని) థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
3) సాహో : ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీకి ఏకంగా రూ.290 కోట్లు (అన్ని వెర్షన్లు కలుపుకుని) థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
4) సైరా నరసింహారెడ్డి : మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఏకంగా రూ.200 కోట్లు (అన్ని వెర్షన్లు కలుపుకుని) థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
5) రాధే శ్యామ్ : ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఏకంగా రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.
6) పుష్ప : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రానికి ఏకంగా రూ.145.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
7) ఆచార్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాంచరణ్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి రూ.133.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
8) అజ్ఞాతవాసి : పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏకంగా రూ.126 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
9) స్పైడర్ : మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బైలింగ్యువల్ మూవీకి రూ.125 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
10) బాహుబలి ది బిగినింగ్ : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీకి రూ.117 కోట్లు (అన్ని వెర్షన్లు కలుపుకుని) థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
11) భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్, రానా కలయికలో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి రూ.109.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
12) సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రూ.101 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
13) భరత్ అనే నేను : మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రూ.100 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
14) మహర్షి : మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏకంగా రూ.95 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
15) ఖైదీ నెంబర్ 150 : మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి రూ.92 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.