యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ & లైక్స్ నమోదు చేసిన టీజర్ గ్లిమ్ప్స్ లు ఏంటో తెలుసా?

ఒకప్పుడు ఓ కొత్త సినిమా వస్తుంది అంటే.. సినిమాకి ముందు ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయ్యేది.ఆ ట్రెండ్ కూడా ‘మగధీర’ టైం నుండీ మొదలైంది. కానీ అటు తర్వాత టీజర్ కూడా వచ్చి చేరింది. షూటింగ్ సగం కంప్లీట్ అయిన వెంటనే ఏదైనా పండుగ ఉంటే టీజర్లు కూడా విడుదల చేసేవారు. ఇప్పుడైతే ఆ టీజర్ విడుదలయ్యే కే టీజర్ అన్నట్టు గ్లిమ్ప్స్ లు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇవి రిలీజ్ చేసేవరకు అభిమానులు ప్రొడక్షన్ హౌస్ లని తెగ టార్చర్ పెడుతుండడం కూడా మనం చూస్తూనే వస్తున్నాం. ఇక ఇవి కూడా రిలీజ్ అయితే యూట్యూబ్ లో రికార్డులు మీద రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం మనం 24 గంటల్లో యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ అండ్ లైక్స్ నమోదైన గ్లిమ్ప్స్ ల గురించి తెలుసుకుందాం.

ముందుగా అత్యధిక లైక్ ల గురించి :

1) వాలిమై : అజిత్- హెచ్.వినోద్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం గ్లిమ్ప్స్ కి 24 గంటల్లో 785.3K లైకులు నమోదయ్యాయి.

2) భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో ‘అయ్యప్పన్ కోషియమ్'(మలయాళం) రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్లిమ్ప్స్ కి 24 గంటల్లో 728.6K లైకులు నమోదయ్యాయి.

3)ఆర్.ఆర్.ఆర్ : చరణ్- ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం గ్లిమ్ప్స్ కి 24 గంటల్లో 622.2K లైకులు నమోదయ్యాయి.

4)’రాధే శ్యామ్ : ప్రభాస్ – రాధా కృష్ణకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం గ్లిమ్ప్స్ కి 24 గంటల్లో 394.4K లైకులు నమోదయ్యాయి.

ఇప్పుడు అత్యధిక వ్యూస్ గురించి :

1) భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో ‘అయ్యప్పన్ కోషియమ్'(మలయాళం) రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్లిమ్ప్స్ కి 24 గంటల్లో 8.49 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

2)ఆర్.ఆర్.ఆర్ : ఎన్టీఆర్- చరణ్- రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం గ్లిమ్ప్స్ కి 24 గంటల్లో 7.53 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

3)సైరా : చిరంజీవి- సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం గ్లిమ్ప్స్ కి 24 గంటల్లో 7.2 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

4)వాలిమై : అజిత్- హెచ్.వినోద్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం గ్లిమ్ప్స్ కి 24 గంటల్లో 6.87 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus