‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చెయ్యబోతున్నారు అని తెలిసినప్పటి నుండీ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా కావడం.. అందులోనూ తక్కువ టైములో సినిమా పూర్తయిపోతుంది అనే విషయం తెలుసుకోవడంతో.. బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ సినిమాలు చూసేయ్యొచ్చు అనేది వారి అభిప్రాయం కావచ్చు. అయితే ఈ రీమేక్ ను సాగర్ చంద్ర అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు అని తెలుసుకున్నప్పటి నుండీ..
అతని గురించి వారు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు ఎవరు ఈ సాగర్ చంద్ర? అని చాలా మంది చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. గతంలో ఈయన ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి చిన్న సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయో.. ఎప్పుడు వెళ్ళిపోయాయో చాలా మందికి తెలీదు. కానీ బుల్లితెర పై అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థల ద్వారా ఈ చిత్రాల్ని చూసిన ప్రేక్షకులు.. తరువాత ఈయనకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు అనడంలో సందేహం లేదు.
మేకింగ్‌తో పాటు రచనలో కూడా మంచి పట్టున్న దర్శకుడు ఈ సాగర్ చంద్ర. గత మూడేళ్ళ నుండీ కాస్త క్రేజ్ ఉన్న హీరోతో సినిమా చెయ్యాలని ఇతను ప్రయత్నాలు చేస్తున్నాడు.కానీ వర్కౌట్ కాలేదు. కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ వంటి బడా స్టార్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ చిత్రం కనుక హిట్ అయితే ఇతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని పడదు.
Most Recommended Video
కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!