సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్లో ‘అతడు’ (Athadu) ‘ఖలేజా’ (Khaleja) తర్వాత వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) . భారీ అంచనాల నడుమ 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానుల అంచనాలను మ్యాచ్ చేయడంలో విఫలమైంది. మరోపక్క భారీ హైప్ తో రిలీజ్ అయిన ‘హనుమాన్’ డామినేషన్ కూడా ‘గుంటూరు కారం’ కి ఎక్కువైంది. అయినప్పటికీ సంక్రాంతి సెలవులు కలిసి రావడం వల్ల బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ చేసింది.
కాకపోతే ఆ సంక్రాంతికి ఫస్ట్ ఆప్షన్ గా ఉండాల్సిన సినిమా.. ప్రేక్షకులకి సెకండ్ ఆప్షన్ అయ్యింది. అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు కూడా మంచి టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. అయితే థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీ, స్మాల్ స్క్రీన్ పై ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు టాలీవుడ్ నుండి హీరోలెవరూ..
ఈ సినిమాపై పాజిటివ్ ట్వీట్స్ లేదా కామెంట్స్ చేసింది లేదు. కానీ ఇప్పుడు ఓ యంగ్ హీరో తనకి ‘గుంటూరు కారం’ అంటే ఇష్టం అంటూ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. అతను మరెవరో కాదు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) . తన ‘దిల్ రుబా’ (Dilruba) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ‘నాకు ‘గుంటూరు కారం’ నచ్చింది.’ అంటూ చెప్పుకొచ్చాడు.
రిపోర్టర్ కూడా ఈ సినిమా నచ్చింది అని చెప్పడంతో.. ‘మరి ఆ విషయంపై మీరేమైనా రాశారా? లేక ఎక్కడైనా ఆ ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేశారా?’ అని కూడా కిరణ్ నిలదీశాడు. ఈ రకంగా అతను మహేష్ అభిమానులను ఖుషీ చేయించాడు అని చెప్పొచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.
నాకు ‘గుంటూరు కారం’ బాగా నచ్చింది : కిరణ్ అబ్బవరం#KiranAbbavaram #GunturKaaram #MaheshBabu #Trivikram pic.twitter.com/4FJ40oigmc
— Phani Kumar (@phanikumar2809) March 4, 2025