Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Advertisement

కరోనా టైమ్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. వాటి పుణ్యమా అని టాలీవుడ్(Tollywood) నిర్మాతలు అప్పట్లో భారీ లాభాలు వెనకేసుకున్నారు. కానీ, ఇప్పుడు అదే డిజిటల్ మార్కెట్ వారిని త్రీవ ఇబ్బందుల్లోకి నెడుతోంది.

Tollywood

నాన్-థియేట్రికల్ రైట్స్ నుంచి భారీగా డబ్బులు వస్తాయి కదా అని నమ్మి ముందుకొచ్చిన ప్రొడ్యూసర్లకు ఓటీటీ సంస్థలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఒకప్పుడు బడ్జెట్‌కు వంద శాతం అప్పులు ఇచ్చిన ఫైనాన్షియర్లు కూడా ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు.

దీంతో చాలా సినిమాల షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోతున్నాయి.అయితే, ఈ కష్టకాలంలో ఓ యంగ్ హీరో చేసిన పనికి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రశంసంలు కురుస్తున్నాయి. ఈ హీరో ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం మేకర్స్ అతనికి ఏకంగా డబుల్ డిజిట్ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. కానీ, షూటింగ్ మొదలైనప్పటి నుంచి సినిమా దాదాపు 90 శాతం పూర్తయ్యే వరకు ఆ హీరో ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదట.

డిజిటల్ రైట్స్ అమ్ముడుపోకపోవడంతో నిర్మాత ఫైనాన్షియల్‌గా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడని ఆ యంగ్ హీరో గ్రహించాడు.దీంతో, కేవలం తన రెమ్యునరేషన్ వదులుకోవడమే కాకుండా.. బ్యాలెన్స్ ఉన్న షూటింగ్‌ను కంప్లీట్ చేయడం కోసం ఏకంగా తన సొంత పాకెట్‌లోంచి రూ.5 కోట్లు తీసి నిర్మాత చేతిలో పెట్టాడట. కావాలంటే అతని పేరుపై సమర్పణగా వేసి ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటానని ఆ హీరో చెప్పాడట.ఇప్పుడా హీరో చేసిన ఈ సాయం ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.

నిజానికి ఇది ఒక్క నిర్మాత సమస్యే కాదని, ఇప్పుడు టాలీవుడ్‌లో చాలామంది నిర్మాతలు ఇదే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఫిల్మ్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. ఇలాంటి టైమ్‌లో హీరోలు కూడా నిర్మాత పరిస్థితి గ్రహించి, తమ రెమ్యునరేషన్స్ తగ్గించుకుంటే తప్ప సినిమాలు బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే నిర్మాతలు కూడా అనవసరపు ఖర్చులు తగ్గించుకుని, తక్కువ టైమ్‌లో షూటింగ్స్ కంప్లీట్ చేస్తేనే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుండీ గట్టెక్కగలరు.

‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus