ప్రముఖ టాలీవుడ్ హీరో ఇక లేరు..!

కెరీర్ ప్రారంభంలో సహాయ నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ‘వరం’, ‘బ్యాచ్‌లర్స్’ వంటి చిత్రాల్లో నటించాడు సత్య. అయితే గురువారం నాడు ఆయన గుండెపోటుతో మరణించడంతో మొత్తం టాలీవుడ్ షాక్ కు గురైంది. శుక్రవారం నాడు ఆయన అంత్యక్రియలు కుటుంబ సభ్యుల మధ్య జరిగాయి. నటుడిగా రాణించలేక పోతుండడంతో సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చిన సత్య.. బిజినెస్ రంగంలో అడుగుపెట్టి ఆ కార్యకలాపాలు చూసుకుంటూ వచ్చాడు. అయితే గురువారం నాడు సాయంత్రం సత్య కి సడెన్ గా గుండెపోటు రాగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతని ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కరోనా సెకెండ్ వేవ్ టైంలో సత్య భార్య, తల్లి కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండీ సత్య మానసికంగా కృంగిపోయాడు. 10 ఏళ్ళ క్రితం సత్యకి వివాహం జరిగింది..అతనికి 8 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. తల్లిదండ్రులను కోల్పోవడంతో సత్య కూతురు రిత్విక ఒంటరి అయిపోయింది. సత్య మరణానికి టాలీవుడ్ పెద్దలు, బంధు మిత్రులు చింతిస్తూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

కరోనా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా సెకండ్ వేవ్ టైంలో.. చాలామంది కుటుంబాల్లో విషాదం మిగిల్చింది కరోనా. సామాన్యులతో పాటు సెలబ్రిటీల కుటుంబంలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు మనం అనేకం చూశాం. సత్య కుటుంబంలో తన భార్యకి, తల్లికి కరోనా సోకడం వల్లనే పరిస్థితి విషమించి వారు ప్రాణాలు కోల్పోయారు. అతని కుటుంబం ఈరోజు ఇలా అయిపోయింది అంటూ స్థానికులు చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus