‘కోర్టు’ (Court) సినిమా హిట్‌తో హర్ష్ రోషన్‌కి (Harsh Roshan) ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. నాని నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అందులో హర్ష్ రోషన్ నటన చాలా మందిని ఆకట్టుకుంది. కోర్టులో ఆత్మవిశ్వాసం, బలమైన డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హర్ష్, ఇప్పుడు మరో బిగ్ ఛాన్స్ దక్కించుకున్నాడు.
టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju), కోర్టు హిట్ తర్వాత హర్ష్ రోషన్‌ను సంప్రదించి ఓ కొత్త ప్రాజెక్ట్‌కి కమిట్ చేశారని సమాచారం. ఈ సినిమా కోసం ఇద్దరి మధ్య ఓ డీల్ కుదిరినట్టు టాక్. ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాలో హర్ష్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. 20 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ నిజ సంఘటన ఆధారంగా ఈ కథ ఉండబోతుందట.
ఈ చిత్రానికి తెల్లకాగితం అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. ఈ సినిమాతో కొత్త దర్శకుడు రమేష్ టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. రమేష్ స్క్రిప్ట్ దిల్ రాజును ఎంతగానో మెప్పించిందట. ఎమోషన్, రొమాన్స్, కాలానుగుణ సామాజిక అంశాలతో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. దీన్ని దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్‌లో, అరుణాచల్ క్రియేషన్స్ భాగస్వామిగా నిర్మించనున్నారు. కృష్ణ కొమ్మలపాటి కూడా నిర్మాతగా కలవబోతున్నారు.
ఇప్పటికే కోర్టు సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు, హర్ష్ టాలెంట్‌కి దగ్గరగా ఉంటూ, ఈ కొత్త ప్రాజెక్ట్‌ని సెట్ చేయడమే కాకుండా, సమ్మర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. హర్ష్ రోషన్‌కు ఇది కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు ద్వారా వచ్చిన క్రేజ్‌ను సద్వినియోగం చేసుకుంటూ, దిల్ రాజు బ్యానర్‌తో కెరీర్‌ను మరింత మెరుగు పరచుకునే అవకాశం ఇప్పుడు హర్ష్‌కు దక్కింది. మరి ఈ ప్రయోగాత్మక కథతో హర్ష్ మరోసారి హిట్ కొడతాడా? అన్నది వేచి చూడాల్సిందే.