ఒకే రోజు రిలీజ్ కానున్న ముగ్గురి సినిమాలు!

  • November 5, 2017 / 03:28 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి పెరిగింది. బడ్జెట్, కలక్షన్స్ విషయంలోనే కాదు.. చిత్ర నిర్మాణాల సంఖ్యలోను మార్పు కనిపిస్తోంది. ఈ ఏడాది అత్యధిక సక్సస్ రేటు నమోదు కావడంతో.. ఫిలిం మేకర్స్ సినిమాలు రూపొందించడంలో ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకే రిలీజ్ విషయంలో ఇబ్బంది పడకుండా ఉండాలని ముందుగానే డేట్స్ ఫిక్స్ చేస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాల విషయంలోనే కాదు.. యువ హీరోల సినిమాల విషయంలోనూ జాగ్రత్త పడుతున్నారు. అలా ప్లాన్ చేయడం వల్ల ముగ్గురు యువ హీరోలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఆ రోజు ఏమిటంటే.. ఫిబ్రవరి 9.

ఈ తేదీన సాయి ధరమ్ తేజ్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ కానుంది. అదే రోజున మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తున్న తొలిప్రేమ సినిమా అప్పుడే విడుదలకానుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్టర్ శ్రీవాస్  కలయికలో తెరకెక్కుతోన్న “సాక్షం” సినిమాని అప్పుడే రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. మరి వీటిలో ఏది యువత మెప్పు అందుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus