2021 లో ఇప్పటివరకు టాలీవుడ్ టాప్ 10 గ్రాసర్స్ లిస్ట్ ఇదే..!

  • November 19, 2021 / 09:22 AM IST

కరోనా అనేది సినీ పరిశ్రమని చాలా పెద్ద దెబ్బ కొట్టింది.భవిష్యత్తులో థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు థియేటర్లు ఉంటాయా? ఓటిటిలే రాజ్యాలేలతయా? వంటి అనేక ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. అలాంటి సమయంలో థియేటర్ల విలువేంటి అన్నది తెలుగు సినిమాలు చాటి చెప్పాయి. ఈ ఏడాది ఇప్పటికే 100 కి పైగా సినిమాలు విడుదలయ్యాయి. ఓటిటిల్లో రిలీజ్ అయిన చిత్రాలు కాకుండా చిన్న చితకా సినిమాలతో కలుపుకుని ఈ లెక్క ఉంది. అయితే వీటిలో హిట్ అయినవి 10 వ వంతు ఉంటాయి. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు అది కూడా డబ్బింగ్ సినిమాలు కాకుండా గ్రాస్ పరంగా ఓ లుక్కేద్దాం రండి…

1) వకీల్ సాబ్ :

పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.137.65 కోట్ల గ్రాస్ వసూళ్ళను కలెక్ట్ చేసింది.

2) ఉప్పెన :

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.83 కోట్ల గ్రాస్ వసూళ్ళను కలెక్ట్ చేసింది.

3) జాతిరత్నాలు :

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్ళను కలెక్ట్ చేసింది.

4)క్రాక్ :

రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.60.6 కోట్ల గ్రాస్ వసూళ్ళను కలెక్ట్ చేసింది.

5) లవ్ స్టోరీ :

నాగ చైతన్య హీరోగా నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.58.55 కోట్ల గ్రాస్ వసూళ్ళను కలెక్ట్ చేసింది.

6)మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ :

అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్ళను కలెక్ట్ చేసింది.

7)రంగ్ దే :

నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.27.6 కోట్ల గ్రాస్ వసూళ్ళను కలెక్ట్ చేసింది.

8)రెడ్ :

రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్ళను కలెక్ట్ చేసింది.

9)శ్రీకారం :

శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.16 కోట్ల గ్రాస్ వసూళ్ళను కలెక్ట్ చేసింది.

10)సీటీమార్ :

గోపీచంద్ హీరోగా నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.15.10 కోట్ల గ్రాస్ వసూళ్ళను కలెక్ట్ చేసింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus