Allu Arjun: బన్నీ కెరీర్లో టాప్ 10 గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు ఏవంటే?

అల్లు-మెగా కాంపౌండ్ నుండి వచ్చి అటు అల్లా అరవింద్…ఇటు చిరంజీవిల సపోర్ట్ తో గంగోత్రి సినిమాతో సినిమాల్లోకి వచ్చాడు అల్లు అర్జున్. గంగోత్రి తో హైటి కొట్టిన బన్నీ తరువాత ఆర్య సినిమాతో తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయ్యాడు. ఆ తరువాత సినిమాకి సినిమాకి ఒక్కో కథ, వైవిద్యం ఉన్న పాత్రలూ ఎంచుకుని స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు.

బన్నీ, స్టైలిష్ స్టార్ అనే పేర్లు తెలుగులోనే కాదు మలయాళం, తమిళం తో పాటు ఇప్పుడు పుష్ప తో పాన్ -ఇండియా స్టార్ గా ఎదిగిన తీరు చూస్తే అల్లు అర్జున్ సినిమా మీద ఉన్న కాసి, కష్టం ఏంటో ఇట్టే అర్ధం అవుతుంది. గంగోత్రి నుండి పుష్ప వరకు బన్నీ చేసిన సినిమాల్లో ప్లాపులు ఉన్నాయి హిట్లు ఉన్నాయి. ప్రతి సినిమాకి అల్లు అర్జున్ అనే నటుడు రోజు రోజుకు పదునెక్కుతూనే ఉన్నాడు…నీ యవ్వ తగ్గదే లే అంటున్నాడు.

ఇప్పుడు పుష్ప 2 తో ఇండియన్ బాక్స ఆఫీస్ మీద యుద్దానికి రెడీ అయినా (Allu Arjun)  అల్లు అర్జున్…సినిమాల్లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు ఏవో ఓసారి చూసేద్దాం.

10. దేశముదురు

పూరి జగన్నాధ్ దర్శకతంలో వచ్చిన దేశముదురు సినిమా మొదటి మాస్ బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ పక్కన హన్సిక హీరోయిన్ గా చేసిన ఈ సినిమాకి చక్రి గారు ఇచ్చిన పాటలు పెద్ద ప్లస్ పాయింట్…ఈ సినిమా బాక్సఫీస్ దగ్గర 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

9. ఆర్య

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన ఆర్య సినిమా పెద్ద హిట్ అయ్యి బన్నీ కి ఒక మంచి యూత్ ఫాలోయింగ్ ని తీసుకొచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే 30 కోటలకి పైగా వసూళ్లు సాధించింది.

8. బన్నీ

మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ తో కలిసి అల్లు అర్జున్ బన్నీ అనే సినిమా చేసాడు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా మాస్ హిట్ అవ్వడమే కాకుండా 35 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది

7. S/o సత్యమూర్తి

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేసిన ఈ సినిమా, బాక్సఫీస్ దగ్గర యావరేజ్ హిట్ అయ్యింది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మేజర్ రోల్ చేసిన ఈ సినిమా 35 నుండి 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

6. జులాయి

త్రివిక్రమ్-బన్నీ కంబినేషనలో వచ్చిన మారో సినిమా జులాయి ఒక యూత్ ఫుల్ హిట్. 50 రోజులకి పైగా ఆడినా జులాయి సినిమా 40 నుండి 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది.

5. రేస్ గుర్రం

సురేందర్ రెడ్డి దర్శకతంలో బన్నీ చేసిన రేస్ గుర్రం సినిమా ఒక పక్క కమర్షియల్ హిట్. బ్రదర్ సేటిమెంట్, కామెడీ, లవ్, సాంగ్స్ ఇలా ఈ సినిమాలో అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి అండ్ ఈ సినిమా 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.

4. సరైనోడు

ఇక మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటితో బన్నీ చేసిన సినిమా సరైనోడు అయితే బన్నీ కి మొదటి మాస్ బ్లాక్ బస్టర్ అని చెపొచ్చు. ఈ సినిమా అల్లు అర్జున్ కి మొదటి 100 కోట్ల గ్రాస్ సినిమా.

3. దువ్వాడ జగన్నాధం – డీజే

గబ్బర్ సింగ్ డైరెక్టర్ అయినా హరీష్ శంకర్ తో బన్నీ దువ్వాడ జగన్నాధం అనే సినిమా తీసాడు. ఈ సినిమా బన్నీ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్…100 కోట్ల కోళ్ల గొట్టి…150 కోట్లకి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది డీజే.

2. అల వైకుంఠపురములో

త్రివిక్రమ్ తో ముచ్చటగా మూడో సారి కలిసి పని చేసిన బన్నీ మొద్దో హిట్ దక్కింది. 2020 సంక్రాంతి కి విడుదలైన ఈ సినిమా అలంటి ఇలాంటి హిట్ కాలేదు బన్నీ కెరీర్లో మొదటి 200 -250 కోట్ల గ్రాస్ ని చుసిన సినిమా ఇదే. అల వైకుంఠపురములో సినిమా మొత్తంగా 280 కోట్ల గ్రాస్ వరకు రాబట్టింది.

1. పుష్ప: ది రైజ్

ఇక సుకుమార్ తో కూడా మూడో సారి జత కట్టిన బన్నీ…ఈ సారి హిట్ కొడితే అది పాన్-ఇండియా మొత్తం రిసౌండ్ వచ్చేలా వినపడింది. పుష్ప రాజ్ అంటూ బన్నీ చేసిన మన్నేరిజంస్, అచ్తింగ్ కి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తో పాటు హిందీ వాళ్ళు కూడా ఫిదా అయిపోయారు. కట్ చేస్తే పుష్ప సినిమా అల్లు అర్జు కెరీర్లో మొదటి ౩౦౦ కోట్లు, మొదటి పాన్-ఇండియా హిట్ గా నిలిచి లాంగ్ రన్ లో 370 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus